జిమ్, సర్జరీ లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్.. ఎలా సాధ్యమైందంటే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మాధవన్ కు( Madhavan ) ప్రత్యేక గుర్తింపు ఉంది.

మాధవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

బరువు తగ్గడం( Weight Loss ) గురించి మాధవన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

వ్యాయామం చేయలేదని రన్నింగ్ చేయలేదని సర్జరీ అసలే చేయలేదని మాధవన్ వెల్లడించారు.మెడికేషన్ కూడా అస్సలు పాటించలేదని అయినప్పటికీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యానని బాగా బరువు తగ్గిపోయానని మాధవన్ వెల్లడించారు.

రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్( Rocketry: The Nambi Effect ) సినిమాలో బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

రాకెట్రీ సినిమాలో మాధవన్ వేర్వేరు వయస్సు పాత్రలలో నటించి మెప్పించడం కొసమెరుపు. """/" / అయితే ఈ సినిమాలో మాధవన్ కొన్ని సీన్స్ లో బరువు పెరిగి పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.

అయితే ఈ లుక్ నుంచి సాధారణ లుక్ కు మారడానికి 21 రోజులు మాత్రమే పట్టిందని ఆయన తెలిపారు.

నేనొక డాక్టర్ లా మాట్లాడానని అనుకోవచ్చని నేను తీసుకున్న ఆహారం వల్లే బరువు తగ్గడం సాధ్యమైందని మాధవన్ వెల్లడించారు.

నా జీవితంలో సైన్స్ భాగమైపోయిందని అనిపిస్తుందని మాధవన్ తెలిపారు. """/" / నేను అప్పుడప్పుడూ ఉపవాసం ( Fasting ) ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

నేను ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలానని మాధవన్ పేర్కొన్నారు.

6 గంటల 45 నిమిషాలకే నా డిన్నర్ పూర్తయ్యేదని మాధవన్ వెల్లడించడం గమనార్హం.

నేను జ్యూస్ లు ఎక్కువగా తాగానని ఆయన తెలిపారు.నా జీవనశైలి, జీర్ణక్రియకు తగినట్టు ఆహారాన్ని మార్చుకున్నానని మాధవన్ వెల్లడించారు.

మాధవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.మాధవన్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

అక్కడే కాదు ఇక్కడ కూడా అరుపులే.. మహేష్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ సత్తా చాటాడుగా!