ఆత్మకూరు ప్రచారంలో మంత్రి రోజాకు షాక్.. జనాలు లేకపోవడంతో..
TeluguStop.com
వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా, ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయగలదు.
రోజా గళం విప్పిందంటే వైరల్ అవ్వాల్సిందే.మంత్రి వర్గ విస్తరణ మలి విడతలో మంత్రి పదవి దక్కించుకురు రోజా.
నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా టీడీపీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, తన కుమారుడు గాలి భానుప్రకాష్ పై గెలిచి సత్తాచాటారు.
ఇక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ ఆమెకు టూరిజం, సాంస్కృతిక శాఖ బాధ్యతలను అప్పగించారు.
అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.సినిమాల్లోనూ, బుల్లితెరపై ఆకట్టుకున్నారు.
ఇక రాజకీయాల్లోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు రోజా.అసెంబ్లీలోనూ, బయట ప్రతిపక్ష పార్టీలపైన కూడా తనదైన శైలిలో విమర్శలు, పంచ్ లతో ఎటాక్ చేయడం రోజా స్టైలే వేరు.
ఇక రోజా ప్రెస్ మీట్ పెంట్టిందంటే ప్రత్యర్థి పార్టీలకు పంచులే పంచులు.రోజా ఆవేశంగా మాట్లాడే విధానం.
పంచులకు అందరూ ఫిదా అవుతుంటారు.అందుకే రోజాకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.
కాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు.భారీ మెజారిటీ సాధించాలని శ్రమిస్తున్నారు.
"""/" /
సీఎం జగన్ ఆదేశాల మేరకు మండలాల వారీగా మంత్రులు ప్రచార బాధ్యతలను తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి ఆర్కే రోజా కూడా మేకపాటి విక్రమ్ తరఫున ప్రచారం చేస్తున్నారు.
అయితే రోజా ప్రచారానికి వెళ్లగా షాక్ ఇస్తూ భారీ ఎత్తున జనాలు లేకపోవడంతో సో సో అనిపించుకుంది.
రోజా చేసిన రోడ్ షోలు కూడా వెలవెలబోయాయి.దీంతో రోజా వెంట ఉన్న వైసీపీ నాయకులు కంగారుపడ్డారు.
కానీ రోజా మాత్రం తనదైన స్టైల్ ప్రసంగాన్ని చేశారు.మరికొన్ని చోట్ల జనం లేకపోవడంతో ప్రసంగించకుండానే వెనుతిరిగారు.
అయితే ఇందుకు కారణం ఏమైఉంటుందని వైసీపీలో చర్చ మొదలైంది.ఇటీవల రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన