సివిల్స్‌లో టాప్ ర్యాంకర్‌కి ఎంత తక్కువ మార్కులు వచ్చాయో తెలిస్తే షాకే..!
TeluguStop.com
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించడం అంత ఆషామాషీ విషయం కాదు.2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు 5 లక్షల మంది హాజరైతే కేవలం 685 మంది మాత్రమే పాసయ్యారు.
అంటే ఎంత పోటీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అత్యంత కఠినమైన ఈ పరీక్షల్లో ఈ సారి టాప్ త్రీ ప్లేస్‌ల్లో అమ్మాయిలే నిలవడం విశేషం.
అయితే వీరందరికీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలిస్తే నోరెళ్ళబెడతారు.
సాధారణంగా ఏదైనా పరీక్షలో టాప్ ర్యాంకు వచ్చిన వారి మార్కులు చాలా ఎక్కువగా ఉంటాయి.
కనీసం 80-90 శాతానికి పైగా ఉంటాయి.కానీ సివిల్స్‌లో ఆ స్థాయిలో మార్కులు రావడం చాలా కష్టం.
సివిల్స్ మొత్తం మార్కులు 2025 అయితే అందులో సగం మార్కులు వచ్చినా టాప్ 10 ర్యాంక్స్‌లో చోటు దక్కించుకోవడం సాధ్యమవుతుంది.
ఎందుకంటే ఇప్పటి వరకూ సివిల్స్‌లో సాధించిన హైయెస్ట్ పర్సంటేజ్ కేవలం 55.50 మాత్రమే.
2017లో అనుదీప్ దురిశెట్టి 2025 మార్కులకు 1126 (55.60%) సాధించారు.
మెయిన్స్‌లో 1750 మార్కులకు 950, ఇంటర్వ్యూలో 275 కి 176 మార్కులు సాధించారు.
అయితే 2021 సివిల్స్‌లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న శృతి శర్మ 54.56 శాతం మార్కులు సంపాదించారు.
మొత్తంగా 1105 మార్కులు సాధించిన ఈమె మెయిన్స్‌లో 1750 మార్కులకు 932, ఇంటర్వ్యూలో 275 కి 173 మార్కులు సాధించారు.
ఆల్ ఇండియా రెండో ర్యాంక్ అంకిత అగర్వాల్ మొత్తంగా 1050 మార్కులు సాధించారు.
ఈమె మెయిన్స్ లో 1750 మార్కులకు 871, ఇంటర్వ్యూలో 275 కి 179 మార్కులు సాధించారు.
ఇక మూడవ స్థానం సంపాదించిన గామిని సింగ్లా 1045 స్కోర్ చేశారు.ఈ మార్పులను చూస్తుంటే సివిల్స్‌లో అడిగే ప్రశ్నలు ఎంత కష్టంగా ఉంటాయో స్పష్టమవుతోంది.
ఏదేమైనా ఇలాంటి డిఫికల్ట్ ఎగ్జామ్స్ లో మన తెలుగువాళ్లు కూడా సత్తా చాటారు.
ఈ సారి ఎక్కువగా మధ్యతరగతి అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచారు.
కొరటాల శివకు డేట్స్ ఇవ్వలేకపోతున్న స్టార్ హీరోలు…కారణం ఏంటి..?