చైతన్యతో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన శోభితా.. ఏమన్నారంటే?
TeluguStop.com
నటుడు అడివి శేష్ తో కలిసి కూడా చాలా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శోభితా ధూళిపాళ.
ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం అడవిశేషుతో కలిసి మేజర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమాల ద్వారా ఈమెకు అనుకున్నంత పాపులారిటీ రాకపోయినా అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఈమె డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తలతో ఒక్కసారిగా ఈమె సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో డేటింగ్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
వీరిద్దరు కలిసి ముంబైలో పార్టీలు చేసుకున్నారని తరచూ నాగచైతన్య శోభతో కలుస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఇలా వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై చైతన్య కానీ శోభితా కానీ ఇంతవరకు స్పందించలేదు.
ఇలా వీరి గురించి వస్తున్న వార్తలపై స్పందించకపోవడంతో వీరికి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉండటంతో ఈ వార్తలపై నటి శోభిత స్పందించారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఈమె ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా శోభిత మిడిల్ ఫింగర్ చూపిస్తూ తన గురించి వస్తున్న వార్తలన్నింటికీ ఈ విధంగా చెక్ పెట్టారు.
"""/"/ ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.తన గురించి వస్తున్న రూమర్లపై ఈమె పరోక్షంగా ఇలా స్పందించారని పలువురు భావిస్తున్నారు.
ఇక ఈ విషయంపై నాగచైతన్య ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించలేదు.ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇప్పటికే నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
తాజాగా మరో సినిమాకు పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.
బిగ్బాస్-8: వరస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. సంబరాలు చేసుకుంటున్న ప్రేక్షకులు..?