గ్లామర్ టిప్స్ చెబుతున్న అక్కినేని కొత్త కోడలు శోభిత.. ఈ చిట్కాలు పాటించాలంటూ?

అక్కినేని కొత్త కోడలు శోభిత ( Shobhita )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

శోభితకు సోషల్ మీడియా వేదికగా కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే శోభిత తాజాగా గ్లామర్ టిప్స్ చెబుతుండగా ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

న్యాచురల్ టిప్స్ పాటిస్తూనే శోభిత మంచి మార్కులు వేయించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

కనుబొమ్మలకు ఆముదం( Castor Oil For Eyebrows ) అప్లై చేస్తానని జుట్టుకు కొబ్బరినూనెతో మర్ధనా చేస్తానని షూట్ పూర్తైన వెంటనే మేకప్ తీసేసి హాట్ వాటర్ తో స్నానం చేస్తానని శోభిత చెప్పుకొచ్చారు.

ఆరోగ్యంగా ఉండటం కోసం అందంగా కనిపించడం కోసం ఎనిమిది గంటల నిద్ర మాత్రం తప్పనిసరి అని ఆమె వెల్లడించారు.

పాలు, పసుపు, శనగపిండితో ( Milk, Turmeric , Gram Flour )ఫేస్ మాస్క్ వేసుకుంటారని శోభిత చెప్పుకొచ్చారు.

"""/" / అక్కినేని శోభిత చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.చాలామంది హీరోయిన్లు అందం విషయంలో పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేస్తుండగా ఈ హీరోయిన్ మాత్రం వాళ్లకు భిన్నంగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

శోభిత ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా తెలుగుతో పాటు ఇతర భాషల ప్రాజెక్ట్స్ కు సైతం ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు.

"""/" / శోభిత రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.శోభిత నచ్చిన పాత్రలకు మాత్రమే ఓటేస్తున్నారని సమాచారం అందుతోంది.

శోభిత క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా మంచి పాత్రలను ఎంచుకుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతమయ్యే ఛాన్స్ ఉంది.

సోషల్ మీడియాలో సైతం శోభితకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.నాగచైతన్య శోభిత కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

స్టార్ హీరో అక్కినేని చైతన్య శోభిత జోడీని వెండితెరపై చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!