విజయశాంతితో ఆ సినిమాలో నటించనని చెప్పిన శోభన్ బాబు.. అసలేమైందంటే?

నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా విజయశాంతి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో విజయశాంతి 180కు పైగా సినిమాలలో నటించారు.

ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.లేడీ అమితాబ్ గా, లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి పాపులారిటీని సంపాదించుకున్నారు.

విజయశాంతి నటనకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు ఉత్తమ నటి పురస్కారాలు సైతం దక్కాయి.

రాశీ మూవీస్ నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకుంటే చూద్దాం చేద్దాం అని తనతో అనేవారని తెలిపారు.

ఆ తర్వాత శోభన్ బాబు సినిమాకు ఓకే చెప్పి ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని అడగగా తాను ఓకే చెప్పానని నరసింహారావు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత శోభన్ బాబుకు 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని నరసింహారావు అన్నారు.

బావా మరదళ్లు సినిమాను కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో శోభన్ బాబు హీరోగా తెరకెక్కించామని నరసింహారావు తెలిపారు.

రాధికను ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేశామని మరో హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నామని నరసింహారావు అన్నారు.

"""/"/ అయితే శోభన్ బాబు విజయశాంతితో చేయనని చెప్పారని నరసింహారావు వెల్లడించారు.

విజయశాంతి వయస్సులో చిన్న అమ్మాయి అని తనకు కూతురు, చెల్లెలు పాత్రలో విజయశాంతి చేశారని ఆ అమ్మాయి తాను హీరోహీరోయిన్లుగా నటించడం కరెక్ట్ కాదని శోభన్ బాబు అన్నారని నరసింహారావు తెలిపారు.

"""/"/ సుహాసిని ఆ సినిమాలో మరో హీరోయిన్ గా నటించారని నరసింహారావు చెప్పుకొచ్చారు.

అయితే చివరకు మార్కెట్ ను బట్టి సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ శోభన్ బాబు తీసుకున్నారని రాశీ మూవీస్ నరసింహారావు వెల్లడించారు.

ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్ లో శోభన్ బాబు తన గురించి పాజిటివ్ గా చెప్పారని నరసింహారావు పేర్కొన్నారు.

అరుదైన శివుని విగ్రహాన్ని చోరీ చేసిన భారత సంతతి స్మగ్లర్ .. కంబోడియాకు తిరిగి పంపిన అమెరికా