నేను అందుకే ఎలిమినేట్ అయ్యాను.. వైరల్ అవుతున్న శోభాశెట్టి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ నుంచి గత వారం అందరూ ఊహించినట్టే శోభాశెట్టి( Shobha Shetty ) ఎలిమినేట్ అయ్యారు.

శోభాశెట్టిపై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో నెగిటివిటీ ఉండగా ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన శోభాశెట్టి ఆలస్యంగా ఎలిమినేట్ అయ్యారని చాలామంది భావిస్తారు.

అయితే శోభాశెట్టి మాత్రం ప్రేక్షకులు ఇన్నిరోజులు ఉండాలని కోరుకున్నారు కాబట్టే నేను ఉన్నానని చెప్పుకొచ్చారు.

నేను హౌస్ లో ఏం చేసినా గేమ్ కోసం చేశానని ఆమె తెలిపారు.

స్టార్ మా ( Star Maa ) ఛానల్ వల్లే నేను హౌస్ లో కొనసాగానని చాలామంది భావిస్తున్నారని అయితే అలా కామెంట్ చేసేవాళ్లు నంబర్ ఇస్తే నేను మాట్లాడతానని శోభాశెట్టి కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో మరో వారం కొనసాగి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు.

శోభాశెట్టి మాత్రం తనపై ప్రేక్షకుల్లో ఎంత నెగిటివిటీ ఉన్నా ఆ నెగిటివిటీని అధిగమిస్తూ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

"""/" / బిగ్ బాస్ షో ద్వారా శోభాశెట్టికి ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్( Remuneration ) దక్కిందని సమాచారం అందుతోంది.

శోభాశెట్టికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉండగా కార్తీకదీపం సీరియల్( Karthika Deepam ) అభిమానులు సైతం ఆమెకు సపోర్ట్ చేశారని తెలుస్తోంది.

శోభాశెట్టికి పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ బాగా సూట్ అవుతాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / రాబోయే రోజుల్లో శోభాశెట్టి కెరీర్ పరంగా మరింత ఎదిగి సత్తా చాటాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

శోభాశెట్టి రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.శోభాశెట్టి భవిష్యత్తులో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ప్రేక్షకులు ఇప్పుడు ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు కాబట్టే ఎలిమినేట్ అయ్యానని శోభా శెట్టి అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

భారతీయ ముఠాల మధ్య ఆధిపత్య పోరు .. కెనడాలో ఇద్దరి హత్య, కోర్ట్ సంచలన తీర్పు