శోభాశెట్టికి రింగ్ తొడిగి సర్ప్రైజ్ చేసిన బాయ్ ఫ్రెండ్.. లవ్ చేయడానికి కారణం ఇదేనంటూ?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటి, నటి శోభా శెట్టి ( Shobha Shetty )గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులోనే సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ తో భారీగా క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

ఇక అదే క్రేజ్ తో ఇటీవలే ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బిగ్‌ బాస్‌7 షోలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది శోభా శెట్టి.దాదాపు 14 వారాల పాటు ఆమె హౌజ్‌లో కొనసాగింది.

ఈ క్రమంలో ఆమెపై అనేక ట్రోల్స్ వచ్చాయి.ఎలిమినేట్‌ చేయాలనే డిమాండ్‌ వచ్చింది.

హౌజ్‌లోనూ మోనిత లాగే ఉందనే విమర్శలు వచ్చాయి.తను ఫేక్‌ అంటూ నెట్టింట రచ్చ చేశారు.

కానీ చివరి వరకు ఉండి, తనేంటో చాటి చెప్పింది శోభా శెట్టి.హౌస్ లో ఉన్న సమయంలోనే తాను ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించడంతో పాటు తన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

అంతేకాదు ఆయన శోభా శెట్టి కోసం హౌజ్‌కి కూడా వచ్చాడు.ఆమెని సర్‌ ప్రైజ్‌ చేశాడు.

ఆయన ఎవరో కాదు కార్తీకదీపం( Kartik Deepam ) సీరియల్‌లో డాక్టర్‌ బాబుకి తమ్ముడి పాత్ర చేసి యశ్వంత్‌( Yashwanth ).

చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.ఈ విషయాన్ని శోభా శెట్టి వెల్లడించింది.

ఇదిలా ఉంటే శ్రీముఖి షోలో శోభా శెట్టిని సర్‌ ప్రైజ్‌ చేసింది.శ్రీముఖి యాంకర్‌గా ఆదివారం స్టార్‌ మా పరివార్‌ షో నడుస్తుంది.

ఆదివారం మధ్యాహ్నం ఇది ప్రసారం కానుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది .

"""/" / ఇందులో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, సీరియల్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు.ఇయర్‌ ఎండ్‌ సెలబ్రేషన్‌ మాదిరిగా ఈ షో సాగింది.

అర్జున్‌, అమర్ దీప్‌, ప్రియాంక వంటి వారు పాల్గొన సందడి చేశారు.అందులో భాగంగా శోభా శెట్టి కూడా వచ్చింది.

ఆమెకి షోలో సర్‌ ప్రైజ్‌ చేసింది శ్రీముఖి.కళ్లకి గంతలు కట్టి ప్రియుడు యశ్వంత్‌ని తీసుకొచ్చి ముందు నిల్చోబెట్టారు.

ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది శోభా.ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.

ఆనందంతో ఉప్పొంగిపోయింది.అంతేకాదు షోలోనే ఆమెకి ప్రపోజ్‌ చేశాడు యశ్వంత్‌.

రోజా పువ్వు తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెకి ప్రపోజ్‌ చేయగా మరింతగా హ్యాపీ అయ్యింది శోభా శెట్టి.

శ్రీముఖి ఉండి శోభా ఎలా అనిపించింది ఈ సర్‌ప్రైజ్‌ అనగా.వాడు షోకే రాడు సరిగా, ఇక్కడికి వస్తాడని అస్సలు ఊహించలేదని తెలిపింది.

ఈ క్రమంలో మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు యశ్వంత్‌.స్టేజ్‌పైనే, అందరి ముందు శోభా శెట్టికి రింగు తొడిగాడు.

"""/" / కొత్త ఏడాది గిఫ్ట్ ఇచ్చాడు.ఇంకా చెప్పాలంటే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగినంత పని చేశాడు.

ఇలా వరుస సర్‌ప్రైజ్‌లకు శోభా శెట్టి ఆనందానికి అవదుల్లేవు.దీంతో అటు ఆర్టిస్టులు, కమెడియన్లు ఇలా అంతా ఆశ్చర్యపోయారు.

అనంతరం ఒక క్రేజీ ప్రశ్న అడిగింది యాంకర్‌ శ్రీముఖి.యశ్వంత్‌ని ప్రేమించడానికి కారణమేంటి? అని అడిగింది శ్రీముఖి.

దీనికి శోభా శెట్టి స్పందిస్తూ తనని ఎక్కువగా కేరింగ్‌ చేస్తాడని, అంతేకాదు వాడి ఇన్‌స్టా ప్రొఫైల్‌ కూడా చెక్‌ చేశాను, ఎక్కువగా అమ్మాయిలను ఫాలో చేయడం లేడు అంటూ బాంబ్‌ పేల్చింది.

క్రేజీగా ఆన్సర్‌ ఇచ్చింది.దీనికి అంతా ఆశ్చర్యపోయారు.

అటు శ్రీముఖి నోరెళ్లబెడితే, యశ్వంత్‌ కూడా అవాక్కయ్యాడు.ఇంత చేస్తుందా అనేలా ఫీల్‌ అయ్యాడు.

ఇది చూసిన మానస్‌.అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు.

బ్రో నీ ఫ్యూచర్‌ కనిపిస్తుంది అని పంచ్‌ వేయడంతో షోలో నవ్వులు విరిసాయి.

యశ్వంత్‌ కూడా నవ్వులు చిందించాడు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది.

అట్లీ లుక్ పై కామెంట్లు చేసిన బాలీవుడ్ కమెడియన్.. ఈ బాలీవుడ్ నటుల తీరు మారదా?