సీక్రెట్ ఎంగేజ్ మెంట్ గురించి చెప్తూనే పెళ్లి ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి
TeluguStop.com
గతేడాది బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg Boss7 )లో కంటెస్టెంట్ గా వచ్చిన శోభాశెట్టి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక బిగ్ బాస్ లో డేరింగ్ అండ్ డాషింగ్ మాటలతో మిగతా వాళ్లందరికీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే సంపాదించుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా తను ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దాంతో ఇప్పుడు ఆ ఫోటోలు విపరితం గా వైరల్ అవుతున్నాయి.మంచి పాపులారిటిని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఏ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా తన ఎంగేజ్ మెంట్ ని పూర్తి చేసుకోవడం పట్ల ఆమె అభిమానులు తీవ్రమైన నిరాశకు లోనువుతున్నారు.
"""/"/
ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో తను కంటెస్టెంట్ గా ఉన్నప్పుడే తన ప్రియుడు అయిన యశ్వంత్ రెడ్డి( Yashwanth Reddy ) ని పరిచయం చేసింది.
ఇక ఇప్పుడు సడన్ ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.ఇక బిగ్ బాస్ కి రాకముందు శోభ శెట్టి 'కార్తీక దీపం'( Karthika Deepam ) సీరియల్ లో మాంచి గుర్తింపు ను సంపాదించుకుంది.
అందులో నెగిటివ్ పాత్రను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది.ఇక అదే సీరియల్లో యశ్వంత్ రెడ్డి కూడా నటించడంతో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం చిగురించి, ఆ తర్వాత అది ప్రేమగా మారింది.
ఇక వీళ్లిద్దరూ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇక గత సంవత్సరమే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అంటూ శోభా శెట్టి ఒక సందర్భంలో తెలియజేశారు.
"""/"/
ఇక కొద్ది రోజుల్లోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే శోభాశెట్టి( Shobha Shetty ) బెంగుళూరు లో ఉన్న వాళ్ల ఇంట్లోనే ఎంగేజ్ మెంట్ ని చాలా సింపుల్ గా పూర్తి చేసుకోవడం తో పెళ్ళి కూడా ఎంగేజ్ మెంట్ లాగే చాలా సింపుల్ గా చేసుకుంటారా ఏంటి అని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో కొన్ని డౌట్లను వ్యక్తం చేస్తున్నారు.
ఇక వీటి మీద రీసెంట్ గా స్పందించిన శోభా శెట్టి వాళ్ల అమ్మ నాన్న కోరిక మేరకు ఎంగేజ్ మెంట్ చాలా సింపుల్ గా చేసుకున్నాను.
కానీ పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చాలా గ్రాండ్ గా చేసుకుంటాను అని తెలియజేసినట్లు గా తెలుస్తుంది.
ఆదిత్య 369 సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఆ విషయంలో డౌట్స్ అక్కర్లేదట!