శివుడికి ఇష్టమైన ప్రదోషకాలం... శివుడికి ఈ విధంగా పూజిస్తే..?

ప్రదోషమంటే ఎంతో విశిష్టమైన సమయం, పాప నిర్మూలనా అని అర్థం.ఈ ప్రదోషకాలం ప్రతిరోజు సూర్యుడు అస్తమించే సమయంలో చంద్రుడు కదలికల వలన ఏర్పడే సమయాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారు.

కనుక చంద్రుడు కదలిక వల్ల ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే ఆ సమయాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారు.

అయితే ప్రతి రోజూ మనకు సూర్యాస్తమయం ఏర్పడుతుంది కనుక సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు కదలికల వల్ల తిథి మారితే అప్పుడు ప్రదోష సమయం వస్తుంది.

ఈ విధంగా ప్రతి రోజు కలిగే ప్రదోశాలపై కి మూడు ప్రదోశాలు ఎంతో ముఖ్యమైనవి.

అవి సప్తమి, చతుర్దశి, త్రయోదశి సమయాలలో కలిగే ప్రదోశాలు ముఖ్యమైనవి ఈ మూడు ప్రదోషాలలో కూడా త్రయోదశి రోజు కలిగే దోషాన్ని మహాప్రదోషం అని పిలుస్తారు.

ఈ విధమైనటువంటి త్రయోదశి ప్రదోషం కేవలం శనివారం మాత్రమే వస్తుంది.ఈ విధమైనటువంటి ప్రదోషము ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైనది కనుక మార్చి 26న ఈ ప్రదోషము వచ్చినది.

కనుక ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి స్వామివారి పూజలో పాల్గొనాలి.

సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది.ఆ సమయములో ప్రదోషమైతే, కొన్ని అనుష్ఠానములు చేయాల్సి ఉంటుంది.

మామూలుగా అయితే గాయత్రి జపము, ధ్యానము చేయవచ్చు.కాకపోతే ఈ ప్రదోషకాలం పై కేవలం ఆ పరమశివునికి మాత్రమే అధికారం ఉంటుంది.

కనుక ప్రదోషకాలంలో స్వామి వారికి మాత్రమే పూజలు నిర్వహించాలి.ఎంతో పవిత్రమైన ఈ సమయంలో ఆ పరమశివుడు తన ప్రమథగణాలలో కొలువై ఉండి భక్తులు చేసే పూజలను స్వీకరిస్తాడు.

ఈ ప్రదోష సమయంలో స్వామివారికి ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్తి పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఎవరికి చేతనైన రీతిలో వారు అభిషేకం చేసి స్వామి వారిని పూజించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ వాయిదా