ఆ హీరో తో రొమాన్స్ చెయ్యడం ఇష్టం లేకనే ఆ సినిమాని వదులుకున్నా – శివాని రాజశేఖర్

ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి తనకంటూ ఒక మార్కు ని క్రియేట్ చేసుకొని యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరో రాజశేఖర్.

( Rajasekhar ) ఒకప్పుడు ఈయన మన టాలీవుడ్ లో టాప్ 5 హీరోలలో ఒకడు.

ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ ఈయన కెరీర్ లో ఉన్నాయి.

ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ, మార్కెట్ మొత్తం పూర్తిగా పోయింది.

ఇప్పిప్పుడే క్యారక్టర్ రోల్స్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇకపోతే రాజశేఖర్ కి ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

పెద్ద కూతురు పేరు శివాని రాజశేఖర్, చిన్న కూతురు పేరు శివాత్మిక రాజశేఖర్.

వీళ్లిద్దరు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా అడుగుపెట్టి చాలా కాలమే అయ్యింది కానీ, ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేదు, గుర్తింపు కూడా లేదు.

"""/" / అయితే వీళ్ళిద్దరూ కూడా అందరి హీరోయిన్స్ లాగ అందాలను ఆరబొయ్యడం, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం వంటివి చెయ్యడానికి ఇష్టపడరట.

అందుకే అవకాశాలు అనుకున్న స్థాయిలో రాలేదని స్వయంగా వీళ్ళే అంటున్నారు.రీసెంట్ గా శివాని రాజశేఖర్( Shivani Rajashekar ) ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ' నాకు గతం లో ఉప్పెన సినిమాలో( Uppena Movie ) హీరోయిన్ రోల్ ఆఫర్ వచ్చింది.

డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు చాలా బోల్డ్ గా, లిప్ లాక్ సన్నివేశాలు మరియు ఇంటిమేట్ సన్నివేశాలతో నిండిపోవడం తో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేను, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాను అని చెప్పాను.

కానీ డైరెక్టర్ గారు నాకు చెప్పిన కథ ఒకటి, కానీ అక్కడ తీసిన కథ మరొకటి, అలా ఈ చిత్రం నా చెయ్యి జారిపోయింది' అంటూ చెప్పుకొచ్చింది శివాని.

ఇది తెలుసుకున్న ఆడియన్స్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / రీసెంట్ గానే ఈమె 'కోటబొమ్మాళి పీఎస్'( Kotabommali PS ) అనే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది, శ్రీకాంత్ హీరో గా నటించిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

'లింగి లింగి లింగిడి' అనే ఫేమస్ పాట ఈ చిత్రం నుండి వచ్చినదే.

ఈ పాట కారణం గానే సినిమాపై మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.

సినిమా అయితే హిట్ అయ్యింది కానీ, శివాని కి అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదు.

ఆమె కెరీర్ ని మలుపు తిప్పే సినిమా కోసం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ .. త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం