క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాజశేఖర్ నటించడానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన శివాని!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్( Rajasekhar )ఒకరు.

ఈయన ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి రాజశేఖర్ ఈ మధ్యకాలంలో చేసే సినిమాలేవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఈయన నటించిన సినిమాలు కొన్ని వివాదాల వల్ల ఆగిపోవడం కూడా జరుగుతుంది.చివరిగా రాజశేఖర్ శేఖర్ ( Sekhar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

"""/" / ఇక హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజశేఖర్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే నితిన్ ( Nithin ) హీరోగా నటిస్తున్నటువంటి ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra Ordinary Man ) అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.

ఇలా హీరోగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈయన కుమార్తె హీరోయిన్ శివాని ( Shivani ) వెల్లడించారు.

ఈమె కోటబొమ్మాలి ( Kota Bommali ) అనే సినిమాలో నటించారు ఈ సినిమా ఈ నెల 24వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

"""/" / ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తన తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాన్నకు ఎప్పటినుంచో కూడా నెగిటివ్ పాత్రలలో విలన్ పాత్రలలో నటించాలని కోరికగా ఉండేది.

విజయ్ సేతుపతి అరవిందస్వామి, జగపతి బాబు వంటి వారి తరహాలో ఈయన కూడా నెగిటివ్ పాత్రలలో నటించాలని కోరుకుంటున్నారు.

అనుకోని విధంగా నితిన్ సినిమాలో ఈ పాత్ర నాన్నకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు అంటూ ఈ సందర్భంగా శివాని హీరో రాజశేఖర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?