రంగులు మారుతున్న శివ‌లింగం.. ఎక్క‌డంటే..?

మన భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఉన్న దేవాలయాల్లో అనేక వింతలు ఉంటాయి.వాటిని ఒక్కో సారి చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.

ఈ అనేక ప్రత్యేకతల వల్లే చాలా మంది ఈ దేవాలయాలను నమ్ముతారు.ఎంత దూరంలో ఉన్నా సరే ఒక్కసారైనా పోవాలని ప్రయత్నిస్తుంటారు.

అలాంటి దేవాలయమే రాజస్థాన్ రాష్ట్రంలోని డోలాపూర్ నగరంలో కొలువై ఉంది.ఈ దేవాలయం లో మహాశివుడు కొలువై ఉంటాడు.

ఇక్కడి శివలింగం ప్రత్యేకత గురించి తెలిస్తే.ఎవరైనా సరే నోరెళ్లబెడతారు.

ఇంతకీ అక్కడి విశేషం ఏంటంటే.ఇక్కడ ఉన్న శివలింగం తనంతట తానే రంగులు మార్చుకుంటుందట.

చాలా విచిత్రంగా ఉన్న ఈ విషయం గురించి ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే.

సూర్యకిరణాలను బట్టి ఇక్కడి లింగం తన రంగులు మార్చుకుంటుందట.ఈ వింతను చూసి అక్కడకు దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు షాక్ కు గురవుతారు.

ఇక్కడ సాక్ష్యాత్తు ఆ మహాశివుడే కొలువై ఉన్నాడని నమ్ముతారు.ఉదయం పూట ఎర్రని రంగులో, మధ్యాహ్నం వేళలో.

కాషాయ రంగుతో, సాయంత్రం సమయంలో గోధుమ రంగులో ఉంటూ ఈ శివలింగం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

"""/"/ ఇదంతా ఆ మహాశివుడి లీలే అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.కానీ ఇదంతా సైన్స్ వల్లే జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

అంతే కాకుండా ఇక్కడ దర్శనమిచ్చే శివలింగం స్వయంభూ లింగమని పలువురు చెబుతారు.కేవలం రాజస్థాన్ లో మాత్రమే కాకుండా ఇలాంటి దేవాలయం ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆపూర్ అనే ఊరిలో ఇలాంటి శివలింగం ఉండడం విశేషం.ఇదంతా చూసిన అనేక మంది ఇది శివుడి మహత్యమే అని చెబుతారు.

మనం గమనిస్తే.సాధారణంగా శివలింగాలు బ్లాక్ లేదా వైట్ కలర్ లో మాత్రమే కనిపిస్తాయి.

దేవర మూవీ క్లోజింగ్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్టీఆర్ స్టామినాకు అసలు ప్రూఫ్స్ ఇవే!