బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ పెద్ద కుమారుడు.. ఎమోషనల్ అయిన హీరో?
TeluguStop.com
బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ఇప్పటికే 9 వారాలను పూర్తి చేసుకొని పదవ వారంలోకి అడుగుపెట్టింది.
ఈ క్రమంలోనే ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్లి సందడి చేయబోతున్నారని తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.
తాజాగా బిగ్ బాస్ నుంచి విడుదలైనటువంటి ప్రోమోలో భాగంగా హౌస్ లోకి ఒక్కో కంటెస్టెంట్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే మొదటగా కంటెస్టెంట్ శివాజీ ఫ్యామిలీ మెంబర్స్( Family Members ) హౌస్ లోకి అడుగు పెట్టారు.
శివాజీ చేయి బాగలేని సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనని రూమ్ కి పంపించినటువంటి బిగ్ బాస్ డాక్టర్ చేత చెక్ చేయించారు.
"""/" /
అయితే అప్పటికే అక్కడ శివాజీ ( Shivaji ) పెద్ద కుమారుడు డాక్టర్ గా మాస్క్ వేసుకొని ఆ కళ్ళజోడు, ఎఫ్రాన్ తో గుర్తుపట్టలేనంతగా ఉన్నారు.
ఇక శివాజీ పెద్ద కుమారుడు డాక్టర్ లాగే తన చెయ్యి ఎలా ఉంది ఎక్సర్సైజెస్ ఎలా చేస్తున్నారు అంటూ కూడా అన్ని ప్రశ్నించారు ఇక తనకు చెకప్ పూర్తి అయిన తర్వాత శివాజీ తన కొడుకు( Son ) ని గుర్తుపట్టలేక బయటకు వెళ్ళిపోతూ ఉండగా ఒకసారి తన కుమారుడు నాన్న అంటూ పిలవడంతో ఒక్కసారిగా శివాజీ షాక్ అయ్యారు.
ఇలా తన పెద్ద కొడుకు నాన్న అని పిలవడంతో వెంటనే శివాజీ వెనక్కి తిరిగి చూడగా తన కుమారుడు మాస్క్ తీయడంతో ఒక్కసారిగా శివాజీ షాక్ అవుతూ తన కొడుకును గట్టిగా హాగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
"""/" /
ఇలా కొడుకుని పట్టుకొని గట్టిగా ఏడ్చినటువంటి శివాజీ అనంతరం తన కొడుకుని బయటకు తీసుకెళ్తూ నా కొడుకు వచ్చాడు అంటూ కంటెంట్లకు చెప్పగా ఒక్కసారిగా అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం శివాజీ కుమారుడు తనతో మాట్లాడుతూ అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు నీకు కాస్త సిగ్గు ఎక్కువ కదా చిన్నోడు వస్తాడేమో అనుకున్నాను అంటూ మాట్లాడగా చదువుల కోసం వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో మరో ఎనిమిది నెలల పాటు ఇండియాలో ఉండనని అందుకే తనని చూడటానికి వచ్చాను అని తన కుమారుడి చెప్పడంతో శివాజీ ఎమోషనల్ అయ్యారు.
అనంతరం తన తండ్రిని తన కుమారుడు ఓదారుస్తూ ఈ ప్రోమోలో కనిపించారు.మొత్తానికి ఈ వారం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా ఈ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని ఈ ప్రోమో ద్వారా తెలుస్తుంది.
ఓట్స్ ఆరోగ్యకరమే.. కానీ వారు తినకపోవడమే బెటర్..!