వర్మకు జీవితాన్నిచ్చింది ఆ కులం వాళ్లు.. వ్యూహం మూవీ ప్రభావం చూపదు.. శివాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

శివాజీ( Shivaji ) బిగ్ బాస్ షో విజేతగా నిలుస్తాడని అందరూ భావించినా వేర్వేరు కారణాల వల్ల శివాజీ బిగ్ బాస్( Bigg Boss ) విజేతగా నిలవలేదు.

తాజాగా శివాజీ వ్యూహం సినిమా( Vyuham Movie ) గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

వ్యూహం సినిమా నుంచి తాజాగా జగనన్న సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే.వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా వ్యూహం సినిమాపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది.

శివాజీ మాట్లాడుతూ వర్మ సినిమాలను ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

గతంలో వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీశాడని వర్మకు లైఫ్ ఇచ్చిందే కమ్మవాళ్లు అని శివాజీ పేర్కొన్నారు.

వర్మకు తిండి పెట్టిందే కమ్మవాళ్లు అని ఆయన కామెంట్లు చేశారు.అలాంటి కమ్మ కులంపై వర్మ ( Ram Gopal Varma ) సినిమాలు తీస్తున్నాడంటే వర్మ ఎలాంటి మనిషి అనుకోవాలని శివాజీ చెప్పుకొచ్చారు.

"""/" / చంద్రబాబును( Chandrababu Naidu ) తిట్టినవాళ్లు జగన్ కు( Jagan ) అభిమాని అవుతారని ఆయన కామెంట్లు చేశారు.

బాబును తిడుతున్నారు కాబట్టి జగన్ ఫండింగ్ చేస్తున్నాడని వర్మ సినిమా తీస్తున్నాడని శివాజీ కామెంట్లు చేశారు.

వర్మ తెలివైన బిజినెస్ మేన్ అని జగన్ ను వర్మ వాడుకున్నాడని శివాజీ వెల్లడించారు.

వ్యూహం సినిమా ప్రభావం చూపదని ఆయన అన్నారు.ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నించారా అని ఆయన పేర్కొన్నారు.

"""/" / వర్మ లాంటి వ్యక్తులు సినిమాలు తీసి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తే ఎవరైనా పట్టించుకుంటారా అని ఆయన అన్నారు.

పవన్ ను, చంద్రబాబును వ్యూస్ కోసం వర్మ తిడుతుంటారని శివాజీ అన్నారు.శివాజీ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

How Modern Technology Shapes The IGaming Experience