Naresh Shivaji Raja: నరేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ భ్రష్టే…. స్నేహితులను కూడా విడగొడతాడు

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఆక్టర్స్ లో ఒకరు శివాజీ రాజా.( Shivaji Raja ) ఐతే ఎప్పుడు తన పని తానూ చేసుకుపోతూ, సౌమ్యంగా ఉండే శివాజీ రాజా ఈ మధ్య "మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్" (మా)( MAA ) ఎలక్షన్స్ కారణంగా ఎక్కువగా న్యూస్ లో కనబడుతున్నారు.

2017 నుంచి 2019 వరకు "మా" ప్రెసిడెంట్ గా ఉన్నారు శివాజీ రాజా.

అదే సమయంలో నరేష్ జనరల్ సెక్రటరీ గా ఉన్నారు.ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ ( Naresh ) గురించి శివాజీ రాజాను ప్రశ్నించగా ఆయన చాలా వివాదాస్పద కామెంట్స్ చేసారు.

అవేంటో ఇప్పడు చూద్దాం.శివాజీ రాజా "మా" ప్రెసిడెంట్ గా( MAA President ) ఉన్నప్పుడు మంచి పథకాలను ప్రవేశపెట్టి మంచి పేరు సంపాదించాడు.

మళ్లీ ఆయనే రెండో సారి గెలుస్తాడని అనుకున్నారు అంతా.కానీ నరేష్ ప్యానల్ శివాజీ రాజాను ఓడించింది.

ఈ సంఘటనను ఉద్దేశించి శివాజీ రాజాను నరేష్ గురించి ప్రశ్నించగా ఆయన నరేష్ దుర్మార్గుడని, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అని అన్నారు.

"""/" / నరేష్ కారణంగా చాలా మంది స్నేహాలు దెబ్బతిన్నాయని అన్నారు శివాజీ రాజా.

నరేష్ గురించి మాట్లాడుతూ ఒక సంఘటను గుర్తుచేసుకున్నారు శివాజీ రాజా.ఒకసారి శివాజీ, శ్రీకాంత్ లతో కలిసి మరికొందరు చిరంజీవి,( Chiranjeevi ) నాగార్జునలు( Nagarjuna ) రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినపుడు "మా" ఛాంబర్ లో నరేష్ టీవీలో ఒక ఫేక్ స్క్రోలింగ్ రన్ చేశారట.

అదేమిటంటే శివాజీ రాజా కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఉండగా లిఫ్ట్ ఆఫ్ చేసాడని.

ఈ విషయాన్నీ చాలా ఘాటుగా ఖండించారు శివాజీ రాజా. """/" / నరేష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ భ్రష్టే అని అన్నారు.

నరేష్ వచ్చి తనకు, శ్రీకాంత్ కి క్షమాపణ చెప్తే తప్ప అతన్ని మన్నించేది లేదని అన్నారు శివాజీ రాజా.

2019 లో జరిగిన మా ఎలక్షన్ లో నరేష్ ప్యానెల్ విజయం సాధించగా, నరేష్ ప్రెసిడెంట్ గాను, జీవిత గారు జనరల్ సెక్రటరీ గాను ఉన్నారు.

ప్రస్తుతం "మా" ప్రెసిడెంట్ గా మంచు మనోజ్, జనరల్ సెక్రటరీ గా రఘు బాబు గారు ఉన్నారు.