బిగ్ బాస్ హౌస్ నుంచి శివాజీ ఔట్.. విన్నర్ అవుతాడని అనుకుంటే బిగ్ బాస్ భారీ షాకిచ్చారుగా!
TeluguStop.com
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) రేటింగ్స్ గత సీజన్లతో పోలిస్తే బెటర్ గానే ఉన్నా ఈ సీజన్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఫెయిల్ అవుతోంది.
ఇష్టానుసారం చేస్తున్న మార్పులు బిగ్ బాస్ అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్7 కంటెస్టెంట్లలో ఒకరైన శివాజీ( Shivaji ) ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తాజాగా ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమో చూసి శివాజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.వాస్తవానికి శివాజీ బిగ్ బాస్7 విజేతగా నిలిచే అవకాశం ఉందని అందరూ భావించారు.
శివాజీ పారితోషికం వారానికి నాలుగు లక్షల రూపాయలు అని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే షోలో ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
"""/" /
బిగ్ బాస్ షో టీం చేస్తున్న తప్పుల వల్ల ఈ షోపై విరక్తి వస్తోందని మరి కొందరు చెబుతున్నారు.
మరోవైపు శివాజీకి భుజం నొప్పి ఉందని ఆ నొప్పి చికిత్స కోసమే హౌస్ నుంచి బయటకు పంపించారనే చర్చ సైతం జరుగుతోంది.
బిగ్ బాస్ ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆడుకోవడం మాత్రం మంచిది కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
శివాజీ కొన్నిరోజుల పాటు సీక్రెట్ రూమ్ లో రెస్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
"""/" /
బిగ్ బాస్ షో సీజన్7 కోసం నాగార్జున ( Nagarjuna )సైతం ఎంతో కష్టపడుతున్నారు.
అయితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పూర్తిస్థాయిలో దక్కడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ షో కోసం నాగార్జున 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.
వీడియో: కుంభమేళాలో తన్నుల స్వామి లీలలు.. కాలి తాకిడితో రోగాలు మాయమట..?