పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి అదే కారణం: శివాజీ
TeluguStop.com
బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయింది.
ఈ సీజన్లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) విన్నర్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమం పూర్తి కావడంతో ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటుడు శివాజీ ( Shivaji ) వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున బిగ్ బాస్ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాను పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేశారు.
"""/" /
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ వచ్చాను.
అయితే తనని సపోర్ట్ చేయడానికి మరే కారణం లేదు.పల్లవి ప్రశాంత్ చాలా జెన్యూన్ పర్సన్ ఆయన చాలా అమాయకుడు.
ఎంత అమాయకుడు అంటే తనకు సోషల్ మీడియా( Social Media )లో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నప్పటికీ వాటి ద్వారా డబ్బు ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా తెలియని అమాయకుడని శివాజీ తెలిపారు.
"""/" /
ఇక చాలామంది ప్రశాంత్ కి 2 ఫేసులు ఉన్నాయని అంటూ ఉంటారు.
అలా రెండు విధాలుగా మాట్లాడేవాడు అయితే నెలకు లక్షల్లో ఆదాయం పోగొట్టుకోడని శివాజీ తెలిపారు.
తనని చూడగానే చాలా జెన్యూన్ పర్సన్ అనిపించింది.వీడే నిజమైన కామన్ మ్యాన్ అనే భావన నాకు కలగడంతోనే తనని మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చానని చివరికి కామన్ మ్యాన్ గా వచ్చిన ప్రశాంత్ సాధించాడు అంటూ శివాజీ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.