శివ సినిమా లో సైకిల్ చైన్ సీన్ కోసం ఇంట్లో రోజంతా ప్రయత్నించి చివరికి ?

ఇప్పుడంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చూస్తున్నారు కానీ కాస్త వెనక్కి వెళితే శివ సినిమాకి ముందు శివ సినిమా తర్వాత అని విభజించి చూసేవారు అంతలా శివ సినిమా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంది.

అయితే శివ సినిమా గురించి చాలామందికి అన్ని విషయాలు తెలుసు.అయినప్పటికీ ఈ తరం వారికి తెలియని కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శివ సినిమా గురించి స్క్రిప్ట్ చెప్పినప్పుడు మొదటగా ఆ పేరుని విలన్ కి పెట్టాలని అనుకున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కానీ నాగార్జున హీరోకి ఆ పేరు పెడితే బాగుంటుంది అనడంతో హీరోకి శివా పేరు అలాగే విలన్ కి భవాని పేరు ఫిక్స్ చేశారు.

విలన్ కి భవాని అనే పేరు ఫిక్స్ చేయడం వెనక రాధా అనే పేరు మోసిన రౌడీ విజయవాడలో ఉండేవాడు అందుకే విలన్ కి భవాని అని ఫిక్స్ అయ్యాడు వర్మ.

"""/"/ ఇక ఈ సినిమాలో స్టడీ కామ్ కెమెరాలు కొత్తగా వాడిన దర్శకుడిగా రాంగోపాల్ వర్మ కి రికార్డు దక్కింది.

శివ సినిమా హిట్ అయిన తర్వాత అదే ఏడాది దాదాపు పదికిపైన స్టడీ కామ్ చేసుకున్నారు అప్పటి దర్శకులు.

ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి ఫైట్స్ అన్ని కూడా రాంగోపాల్ వర్మ దగ్గర ఉండి కంపోజ్ చేసుకున్నాడు.

తనకు వచ్చిన రెండు బాక్సింగ్ పంచులను మాత్రమే నాగార్జున తో చేయించాడు వర్మ.

ఇక సైకిల్ చైన్ ఈ సినిమాలో నాగార్జున వాడటం మనకు తెలిసిందే. """/"/ సీన్ పెట్టడానికి ముందు వర్మ ఒక రోజంతా కూడా సైకిల్ చైన్ లాగడానికి ప్రయత్నించాడు.

కానీ అసలు సాధ్యం కాలేదు దాంతో ఇక సైకిల్ చైన్ తెగదని అర్థమయింది.

అయితే తెగదని తెలిసిన కూడా ఆ సీన్ నీ వాడకుండా ఉండలేకపోయాడు వర్మ.

చైన్ తెగడం, తెగకపోవడం అనేది ఎవరు ప్రయత్నించరు.కానీ సన్నివేశం పండుతుంది అని నమ్మకంతో వర్మ ఆ పని చేశాడు.

అది సక్సెస్ అవ్వడం వర్మ దర్శకత్వ ప్రతిభ అని చెప్పుకోవచ్చు.

తండ్రి నాలుగు పెళ్లిళ్లపై నరేష్ కొడుకు నవీన్ సంచలన వ్యాఖ్యలు.. కంట్రోల్ చేయలేమంటూ?