ప్రతి సంవత్సరం చింతాకు పరిమాణంలో పెరుగుతున్న శివలింగం.. ఈ ఆలయ ప్రత్యేకత ఇదే..
TeluguStop.com
భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఎంతో చక్కగా ముస్తాబైంది.
నాలుగు రోజుల పాటు సిద్దుల గుట్ట పై అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు శివపార్వతుల కళ్యాణం, అగ్నిగుండాల ప్రవేశం మొదలగు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
అందుకోసం దేవాలయాల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.దేవాలయ సమీపంలోని ఈ విశాల మైదానంలో నిర్మించిన కళ్యాణ మండపంతో పాటు సిద్ధేశ్వరస్వామి కొలవు దీరిన దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, జనగామ, యాదగిరిగుట్ట బోనగిరి ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం, సిద్దేశ్వర స్వామి దేవాలయానికి ఆర్టిసి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు.
"""/"/
అంతేకాకుండా మండల కేంద్రమైన బచ్చన్నపేట మండలం నుంచి ఆటోలు కూడా వస్తున్నాయి.
అంతేకాకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి, ఈవో చిన్న వంశీ వెల్లడించారు.
ఈ నెల 18న నిర్వహించే శివపార్వతుల కళ్యాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, యాదగిరిరెడ్డి, పద్మలతారెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణం తీలకిస్తారని వెల్లడించారు.
"""/"/
శ్రీ సిద్దేశ్వర దేవాలయంలో మహిమానిత్వమైన పుట్టు లింగం ఉంది.ఇది భూమిలో నుంచి పుట్టినదని అందుకే దీనికి పుట్టులింగం అని పిలుస్తారు.
సుమారు మూడు దశాబ్దాలుగా చింతాకు పరిమాణంలో పెరుగుతున్న ఈ పుట్టు లింగం ప్రస్తుతం కొబ్బరికాయ పరిమాణంలో ఉందని పూజారి తెలిపారు.
98 సంవత్సరాల క్రితం పుట్టు లింగం చుట్టుకొలత 21.50 ఇంచులు ఉండగా ప్రస్తుతం చుట్టుకొలత 27.
5 ఇంచులు పెరిగినట్లు చరిత్ర చెబుతోంది.పుట్టు లింగం పెరుగుతుందని నిదర్శనంగా మూడు నాగ ప్రతిమలు ఉన్నాయి.
ఇందులో రెండు ఇత్తడివి, ఒకటి వెండిది.చింతాకు పరిమాణంలో పెరుగుతున్న పుట్టు లింగానికి ఇవి రాబోవు రోజుల్లో ఈ ప్రతిమలు సరిపోవు అంటున్నారు.
టీ పొడితో జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా..?