కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే కరోనా కొరలు చాచింది.. బీజేపీ పై విరుచుకు పడుతున్న శివసేన సామ్నా.. ?

ఒక రాజ్యాన్ని పాలించే రాజు సరిగ్గా వ్యవహరిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చిన్నప్పటి నుండి చదువుకున్న విషయం తెలిసిందే.

అలాగే ఒక దేశాన్ని గానీ, రాష్టాన్ని గానీ పాలించే నేతలు కూడా నీతివంతులై సరైన పాలన అందిస్తే ఆ ప్రజల కంట కన్నీరు కనిపించదు.

కానీ ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి మాటలు చెప్పుకోవడానికే అందంగా కనిపిస్తాయి.ఇక దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంలో పాలకుల నిర్లక్ష్యం సృష్టంగా కనిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో శివసేన ‘మౌత్ పీస్’ సామ్నా తన సంపాదకీయంలో కేంద్ర పెద్దలైన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌లపై విరుచుకుపడింది.

దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని కాకవికలం అవుతుంటే బీజేపీ మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి పెట్టి ర్యాలీలు, రోడ్డు షోలు, నిర్వహించిందని ధ్వజమెత్తింది.

అంతే కాకుండా త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోందని విమర్శల తూటాలు వరుసగా పేల్చింది.

అల్లు అర్జున్ గురించి దారుణమైన విషప్రచారం.. ఖండించకపోతే ఇబ్బందేనా?