మహారాష్ట్ర రాజకీయాల్లో పెరుగుతున్న ఉత్కంఠ, అజిత్ కు వెనక్కి రప్పించడానికి యత్నాలు

మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.మొన్నటివరకు మిత్ర పక్షాల కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న సమయంలో అనూహ్యంగా ఎన్సీపీ పార్టీ నుంచి విడిపోయి అజిత్ పవార్ బీజేపీ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అనూహ్యంగా బీజేపీకి మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ ను వెనక్కి తీసుకురావడానికి ఇప్పుడు విపక్షాల కూటమి ప్రయత్నాలు చేస్తుంది.

అజిత్ పవార్‌ను వెనక్కి రప్పించేందుకు శరద్ పవార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

దాని కోసం పార్టీ నేతలతో రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తుంది.ఇదే సమయంలో అజిత్ పవార్ వెనక్కి వస్తే రెండున్నరేళ్ల పాటు సీఎం చైర్‌లో కూర్చోబెట్టడానికి కూడా శివసేన రెడీగా ఉందని ఈ మేరకు అజిత్ పవార్‌కు ఆఫర్ ఇచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే, అజిత్‌ పవార్‌కు ఆఫర్ వార్తలను ఖండించింది శివసేన.అజిత్ పవార్‌కు ఎలాంటి ఆఫర్ చేయలేదని సీఎం పదవి విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని శివసేన స్పష్టం చేసింది.

కానీ, ఎన్సీపీ మాత్రం వెనక్కి వస్తే రెండున్నరేళ్లు సీఎం కావొచ్చు అనే ఆఫర్‌ను ఆయన ముందు ఎన్సీపీ పెట్టినట్టు కూడా మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి దీనిపై క్లారిటీ లేదు గానీ మొత్తానికి ఈ వార్తలు మాత్రం మహా రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

మరోపక్క అక్కడ పరిస్థితుల పై మిత్ర పక్షాల కూటమి సుప్రీం ను ఆశ్రయించడం తో రాగల 24 గంటల్లో సీఎం ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది.

దీనితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

జక్కన్న రాసి ఇచ్చిన లెటర్ ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. ఆ లేఖలో ఏముందంటే?