ప్రతి ఏడాది పెరుగుతున్న శివలింగం.. ఇక్కడి అభిషేక జలాలతో చర్మ వ్యాధులు దూరం..!

ఈ దేవాలయంలో ప్రతి ఏడాది శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తుందని భక్తులు చెబుతున్నారు.

ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ శివలింగానికి అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అయితే ఈ దేవాలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి.ఇలాంటి విశేషమైన శివాలయం( Shiva Temple ) బీహార్లోని భోజ్‌పూర్ జిల్లాలోని ఆరా పట్టణంలో ఉంది.

ఇక్కడ ఈ బుద్వా మహాదేవ్ దేవాలయం( Budhwa Mahadev ) దేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి.

ఈ దేవాలయానికి మహాభారతంతో ప్రత్యక్ష సంబంధం ఉందని భక్తులు నమ్ముతారు.పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ శివుడిని పూజించేవారని భక్తులు నమ్ముతారు.

"""/" / భోజరాజు బుద్వా దేవాలయంలో మహాదేవుని పూజించేవాడని కూడా నమ్ముతారు.అయితే దేవాలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం దాదాపు చాలామందికి తెలిసి ఉండదు.

అది మీకు తెలిస్తే మీరు కూడా తప్పక అక్కడి దేవాలయంలోని మహాదేవున్ని దర్శించుకుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే వేల సంవత్సరాల క్రిందట ఈ దేవాలయంలో ప్రవేశించిన శివలింగం కాలక్రమమైన ఎంతో ఎత్తుకు ఎదిగిందని భక్తులు నమ్ముతున్నారు.

"""/" / శివలింగం మొదట్లో( Shiva Lingam ) చాలా చిన్నదిగా ఉండేదని కానీ ఇప్పుడు అది నాలుగు అడుగులకు పైగా ఎత్తుకు చేరుకుందని చెబుతున్నారు.

దేవాలయ పూజారి చెప్పిన వివరాల ప్రకారం తమ పూర్వికులు అనేక తరాలుగా దేవాలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారని వారంతా శివలింగం ఎత్తు పెరగడాన్ని చూశారని చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ శివలింగాన్ని అభిషేకించిన జలం చర్మ వ్యాధులను నయం చేసేందుకు చేసేందుకు ఉపయోగపడుతుందని భక్తులు నమ్ముతున్నారు.

ఇది భక్తులు ఇక్కడికి తరలి రావడానికి మరొక కారణం.ప్రతిరోజు వేలాదిమంది శివ భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు.

ముఖ్యంగా శ్రావణమాసంలోనీ శివరాత్రి సమయంలో ఈ దేవాలయం అత్యంత రద్దీగా ఉంటుంది.

డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ గా స్మూత్ గా మార్చే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ మీ కోసం!