Shiva Jyothi :భర్తను మిస్ అయినందుకు తట్టుకోలేకపోతున్న శివజ్యోతి.. ఆపు నీ ఓవరాక్షన్ అంటూ కామెంట్స్?
TeluguStop.com
అప్పుడప్పుడు సెలబ్రిటీలు చేసే పనులకు జనాలు బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా వారు అతిగా ప్రవర్తించినట్లు కనిపిస్తే వెంటనే వారిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు.
అయితే కొందరు సెలబ్రెటీలు కూడా చేసే విధానం అలాగే ఉంటుంది.అది వాళ్లకు ఓవర్ అని తెలిసినప్పటికీ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు.
ముఖ్యంగా షో చేయడానికి పక్కన ఎవరున్నారు అని కూడా చూడకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
అందుకే జనాలు వారిని బాగా టార్గెట్ చేసి కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తుంటారు.
అయితే తాజాగా శివ జ్యోతి కూడా కాస్త అతిగా ఎమోషనల్ అవ్వడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.మొదట్లో శివ జ్యోతి( Shiva Jyothi ) యాంకర్ సావిత్రిగా ఎంత అభిమానం ఉండేదో రానురాను అభిమానం మొత్తం తగ్గిపోయింది.
కారణం ఆమెలో వచ్చిన మార్పు.ఈమె తీన్మార్ వార్తలలో సావిత్రి గా యాంకర్ చేసి తన తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ముఖ్యంగా అందులో తన కట్టుబొట్టు కూడా అందర్నీ ఫిదా చేసింది.అలా ప్రతి ఒక్కరితో మంచి పరిచయం పెంచుకుంది.
"""/" /
అలా సావిత్రికి బిగ్ బాస్ షో ( Bigg Boss )లో అవకాశం వచ్చింది.
ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.
సావిత్రక్క బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షో ద్వారా తెలిసిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత సావిత్రి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది.
ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.
వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.పైగా సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది.
ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.
మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.
తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు ఫోటోలు బాగా పంచుకుంటుంది. """/" /
ఇక తన భర్త గంగూలి( Ganguly )తో కలిసి చేసిన వీడియోలు, దిగిన ఫోటోలు కూడా బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
వీళ్లది ప్రేమ వివాహం.అందుకే చూడ్డానికి ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు.
ఒకరి విడిచి ఒకరు ఉండలేకపోతుంటారు.అయితే రీసెంట్ గా శివ జ్యోతి తన భర్తను వదిలి మొదటిసారి అమెరికాకు వెళ్ళింది.
"""/" /
దీంతో వెళ్లే సమయంలో చాలా ఎమోషనల్ అయింది.ఇక దానికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
తాజాగా ఆమె తిరిగి హైదరాబాద్( Hyderabad ) కి చేరుకోగా తన భర్తను పట్టుకొని చాలా ఎమోషనల్ అయింది.
నిన్ను వదిలి ఉండలేను అంటూ ఎయిర్ పోర్ట్ లోనే ఎమోషనల్ అయినట్లు కనిపించింది.
అయితే దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఆ వీడియో శివ జ్యోతి కూడా పంచుకుంది.
దీంతో ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ నీ ఓవరాక్షన్ ఆపు చూడలేకపోతున్నాం అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది.ఏడ్చేటప్పుడు వీడియో తీయడం.
పెట్టడం.బాధ ఉంటే రీల్ లో పెట్టడం కాదు.
రియల్ గా ఏడవడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది అది భార్యాభర్తల మధ్య అనుబంధం అంటూ.
అది ఓవర్ కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఖంగుతిన్న పూణే జనం.. రోడ్డునే జిమ్‌గా మార్చేసిన తాగుబోతు.. ట్రాఫిక్‌లో ఏం చేసాడో చూడండి..