'ఫైనల్'గా ఒక నిర్ణయం తీసుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ అకౌంట్స్ అన్నీ డిలీట్?
TeluguStop.com
ఏ వ్యక్తికైనా ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడే ఓ అనుభవం అనేది ఏర్పడుతుంది.
దీంతో ఆ అనుభవం వల్ల ఎన్నో మార్పులు వస్తుంటాయి.గతంలో చేసిన తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.
అలా రాజ్ కుంద్రా కూడా తాను చేసిన తప్పులు మొత్తం బయటపడటంతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో అతడు తీసుకున్న నిర్ణయం కూడా ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు గత కొన్ని రోజుల కిందట బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈయన గతంలో నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోగా అతడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇటీవలే బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకున్నాడు రాజ్ కుంద్రా.
ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం.రాజ్ కుంద్రా కొన్ని రోజుల కిందట నీలి చిత్రాలు చిత్రీకరించి వాటిని ఆన్ లైన్ లో పబ్లిష్ చేసినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంలో కొందరి అమాయకులను కూడా బలవంతంగా దింపినట్లు తెలిసింది.వీటి కోసం తాను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పలు యాప్ లను కూడా ఏర్పాటు చేశాడు.
ఇతడితో పాటు మరికొంత మంది పేర్లు కూడా బయట పడటంతో వారందరినీ పోలీసులు విచారించారు.
"""/"/
అంతే కాకుండా ఈ వ్యవహారంలో శిల్పా శెట్టి బాధ్యత కూడా ఉందని అనుమానాలు రావడంతో ముంబై పోలీసులు తనను కూడా విచారించారు.
ఇక మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాను కూడా విచారించారు.దీంతో ఆమె కూడా రాజ్ కుంద్రా గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.
అలా రాజ్ కుంద్రా గురించి మరికొన్ని విషయాలు బయట పడటంతో ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
"""/"/
అలా కొన్ని రోజులు అతడు పోలీసుల అదుపులో ఉండగా బెయిల్ ద్వారా 50 వేల రూపాయల పూచికత్తుతో బయటికి వచ్చాడు.
ఇక అతను జైలు నుంచి వచ్చిన వెంటనే బయటికి రావడానికి ఇష్టపడటం లేదని తెలిసింది.
ఇటీవలే జరిగిన 'కర్వా చౌత్' వేడుకల్లో కూడా అతడు కనిపించలేదని తెలిసింది.ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండేవాడు.
"""/"/
కానీ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదని తెలిసింది.
అంతేకాకుండా అతడు సోషల్ మీడియా అకౌంట్ లను డిలీట్ చేశాడు అని తెలిసింది.
తను పోర్నోగ్రఫీ కేసులో దొరికినందుకు అతనిపై ఎదురవుతున్న విమర్శల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ విషయం గురించి నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.మరి మళ్ళీ రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో అడుగు పెడతాడో లేదో చూడాలి.
ద్రాక్ష పండ్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయా?