అంతర్జాతీయ క్రికెట్‭కు గుడ్ బై చెప్పిన శిఖ‌ర్ ధావ‌న్.. (వీడియో)

టీమిండియా ఓపెనర్లలో ఒకరైన శిఖర్ ధావన్ ( Shikhar Dhawan )తాజాగా తన అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ని తెలిపారు.

క్రెకెట్ కు సంబంధించిన అన్ని ఫార్మాట్లో నుండి తాను రిటైర్ అవుతున్నట్లు శనివారం నాడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ వీడియోని షేర్ చేశాడు.

గడిచిన ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ( Punjab Kings Captain In IPL )గా వ్యవహరించిన ధావన్.

గాయం కారణంగా టోర్నీ మధ్యలో నుంచే బయటకు వచ్చాడు.ఇకపోతే ప్రస్తుతం శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / శిఖర్ ధావన్ ఈ వీడియోలో భావోద్వేగానికి గురైనట్లుగా కనబడుతుంది.ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ.

తాను భారతదేశం కోసం ఆడటం కల నిజమైందని.ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చాడు.

ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్నప్పటినుండి కోచింగ్ ఇచ్చిన కోచ్ లకు, బిసిసిఐ కి, డిడిసిఏ ( BCCI, DDCA ) కి కృతజ్ఞతలు తెలియజేశాడు.

అన్ని ఫార్మేట్ లలో తనదైన ముద్ర వేసిన డాషింగ్ ఓపనలలో ఒకరైన శిఖర్ ధావన్ టీమిండియా కు అత్యుత్తమ ఉపనరులలో ఒకడిగా పేరుపొందాడు.

ఇకపోతే రోహిత్ శర్మ( Rohit Sharma ), శిఖర్ ధావన్ లు కలిసి అనేక మ్యాచ్లలో మంచి పార్ట్నర్షిప్ కొనసాగించారు.

"""/" / శిఖర్ ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులలో 2315 పరుగులు, 167 వన్డేలలో 6793 పరుగులు, 68 టీ20 లలో 1759 పరుగులు సాధించాడు.

కెరీర్ లో మొత్తంగా 17 వన్డే సెంచరీలు., 7 టెస్ట్ సెంచరీలు సాధించాడు.

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‭లో 10887 పరుగులు సాధించాడు.ఇక మరోవైపు 222 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధావన్ 6768 రన్స్ చేశాడు.

ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి.

వైరల్: అరె ఏంది భాయ్ మీ లొల్లి.. మెట్రోలో తెగ కొట్టుకున్న వ్యక్తులు..