ఐపీల్ చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టించిన గబ్బర్..!

టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ ఐపీఎల్ లో చెలరేగి ఆడుతున్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా అవతారమెత్తిన శిఖర్ ధావన్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు.

బౌలర్ ఎవరైనా సరే ఫోర్లు, సిక్సర్లతో సమాధానం చెబుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

ఇక తాజాగా ఐపీఎల్ 13 వ సీజన్ లో భాగంగా శిఖర్ ధావన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈ సీజన్లో రెండో శతకాన్ని సాధించాడు.

కేవలం 61 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అంతే కాదండి ఇదే జోరు తో శిఖర్ ధావన్ ఐదు వేల పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు.

ఇక ఈ మ్యాచ్ ముందర ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా శిఖర్ ధావన్ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

దీంతో వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచ్ లలో 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్ రికార్డుల్లో నిలిచాడు.

ఇకపోతే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

అయితే ఆ తర్వాత చేధనకు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కేవలం 19 ఓవర్లలోనే ఢిల్లీ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది.

దీంతో శిఖర్ ధావన్ చేసిన సెంచరీ వృధా అయిపోయింది.ఇకపోతే ఓకే సీజన్ లో అత్యధికంగా సెంచరీలు చేసిన వ్యక్తుల జాబితాలో 2016 సీజన్ లో విరాట్ కోహ్లీ ఏకంగా నాలుగు శతకాలు సాధించగా, ఆ తర్వాత 2011లో క్రిస్ గేల్, 2017లో కింగ్స్ లెవెన్ పంజాబ్ కు చెందిన హషిమ్ ఆమ్లా రెండు సెంచరీలు, 2018 లో షేన్ వాట్సన్ రెండు సెంచరీలు సాధించగా, తాజాగా 2020లో శిఖర్ ధావన్ రెండు సెంచరీలు సాధించాడు.

అలాగే 5,000 పరుగుల క్లబ్ లో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ల సరసన తాజాగా శిఖర్ ధావన్ చేరాడు.

వైరాకు మంత్రి తుమ్మల.. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పరిశీలన