బాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు కూడా డ్రగ్స్ తీసుకుంటారు?

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి డ్రగ్స్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ మాఫియా నేడు షారుక్ ఖాన్ కొడుకు అరెస్టు వరకు దారి తీసింది.

ముంబై సముద్ర తీరంలోని క్రూయిజర్ షిప్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు NCB అధికారులకు సమాచారం రావడంతో అధికారులు క్రూయిజర్ పై దాడి చేసి షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ స్టార్స్ షారుఖాన్ కి మద్దతు తెలపగా మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఇదిలావుండగా బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా గతంలో తాను చేసినటువంటి ఒక వీడియోను ప్రస్తుతం షేర్ చేస్తూ షారుక్ గురించే పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

షారుక్ ఖాన్ కి ఐపీఎల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అనే టీమ్‌ ఉన్న సంగతి తెలిసిందే.

దానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో భాగంగా తను డాన్స్ చేసి ఎంతో అలసిపోయి వాష్ రూమ్ కి వెళ్లానని, అయితే అక్కడ వాష్ రూమ్ డోర్ తీయగానే తాను ఎంతో షాక్ కి గురైనట్లు తెలిసింది.

అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసి అసలు నేను కరెక్టు చోటికి వచ్చానా అంటూ తనను తాను ప్రశ్నించుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపింది.

"""/"/ అయితే తను వాష్ రూంలోకి వెళ్లగానే అక్కడ కొంత మంది స్టార్ హీరోల భార్యలు అద్దం ముందు నిలబడి డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ బ్యూటీ తన వీడియోలో పేర్కొన్నారు.

ఇది చూసి షాక్ అయిన తను వారిని చూస్తూ ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చానని,ఆ సంఘటన తర్వాత షారుఖ్ ఖాన్ అతని స్నేహితులకు గుడ్ బై చెప్పానని ఈ సందర్భంగా షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/"/ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఎప్పటినుంచో డ్రగ్స్ ఉపయోగిస్తున్నారని, తన ఫ్రెండ్స్ సహాయంతో డార్క్ వెబ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేవారని విచారణలో తేలింది.

ఈ క్రమంలోనే ఎన్సీబీ అధికారులు ఆర్యన్ బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించనున్నట్లు తెలియజేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే14, మంగళవారం 2024