మంత్రి రోజా కుటుంబంతో దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న శేఖర్ మాస్టర్.. ఫోటోలు వైరల్!
TeluguStop.com
సినీనటి రోజా ఎన్నో సినిమాలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా ఒక వైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరోవైపు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి ఇతర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
ఈ విధంగా గత తొమ్మిది సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాలలో పాల్గొంటూనే జబర్దస్త్ కార్యక్రమానికి కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఇక రోజాకు గత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి రావడంతో ఈమె మంత్రిగా తన బాధ్యతలను నిర్వహించడం కోసం తనకు ఎంతో ఇష్టమైన సినిమా రంగాన్ని కూడా వదులుకున్నానని ఇకపై ఎలాంటి కార్యక్రమాలలో కనిపించని ప్రకటించారు.
ఇలా మంత్రిగా బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నప్పటికీ రోజా తనకు సమయం కుదిరినప్పుడల్లా తన కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు.
ఈ క్రమంలోనే ఈమె తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
"""/" /
అయితే రోజా కుటుంబంతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుటుంబం కూడా దుబాయ్ వెళ్లారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ రోజా కుటుంబంతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఎంజాయ్ యువర్ వెకేషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం వీరి దుబాయ్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అల్లు బ్రాండ్ చెక్కు చెదురుతోందిగా.. బన్నీ ఆ ఇబ్బందులను ఎదుర్కోనున్నారా?