స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న శేఖర్ కమ్ముల…
TeluguStop.com
ప్రస్తుతం తమదైన రీతిలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకులలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula) ఒకరు.
ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలుగా నిలుస్తుంటాయి.ముఖ్యంగా ఆయన సినిమాలన్నీటికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది.
ఆయన చేసే ప్రతి సినిమా హై లెవెల్లో ఉండటమే కాకుండా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశ్యంతోనే ఆయన ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు.
"""/" /
ఇక రొటీన్ రెగ్యూలర్ సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించాడు.
ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒక కొత్త పంథా కనిపించాలని చూస్తుంటాడు.అందువల్లే చాలా వరకు ఆయన డిఫరెంట్ ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు.
ఇక ఇప్పుడు ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ద్వారా కూడా ఆయన ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నాడనే వార్తలైతే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఇక నిజానికి శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రి చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.
"""/" /
ఆయన సినిమాల్లో వైలెన్స్ ఉండదు.భారీ డైలాగులు ఉండవు.
చిన్న చిన్న ఎమోషన్స్ తోనే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాని ఎలివేట్ చేస్తూ ఉంటుంది.
అందువల్లే ఆయనకు చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులందరిని మెప్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ధనుష్ ( Dhanush)చేస్తున్న సినిమా తర్వాత ఆయన తెలుగులో ఒక స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలుతే వినిపిస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు.కానీ తెలుగు స్టార్ హీరోలు శేఖర్ కమ్ముల తో సినిమా చేసే అవకాశం ఉందా అంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మరోసారి వెండితెర సందడికి సిద్ధమైన యాంకర్ సుమ…. హిట్ కొట్టేనా?