ఏంటి శేఖర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి అలా చెప్పేసాడు.. నిజమేనా?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.
ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.
ఈ పాత్రల్లో వీరు హీరోయిజాన్ని చూపించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో విభిన్నంగా స్పందించారు.
ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
"""/" /
ఇది ఇలా ఉండగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అంటే వెంటనే వినిపించే పేరుల్లో ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.
ఈయన బొద్దుగా ఉన్న కానీ సన్నగా అయినా కానీ ముందు నుండి నటన ఎలా అదర గొడతాడో డ్యాన్స్ అంత కంటే బెస్ట్ గా చేస్తాడు.
ఈయన ఎంత కష్టమైన స్టెప్ అయినా కూడా వెంటనే వేస్తాడు.ఈయనతో డ్యాన్స్ అంటే హీరోయిన్స్ మాత్రమే కాదు.
కొరియో గ్రాఫర్స్ సైతం భయపడుతూ ఉంటారు.ఏ డ్యాన్సర్ అయినా రిహార్సిల్స్ లేకుండా డ్యాన్స్ చేయడానికి తడబడుతారు.
కానీ ఎన్టీఆర్ మాత్రం ఎంత కష్టమైన స్టెప్ అయినా కూడా రిహార్సల్స్ నే చేయరట.
ఈ విషయాన్నీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతం చెప్పుకొచ్చాడు.మన స్టార్స్ లో తక్కువ రిహార్సల్స్ చేసేది ఎవరు? అని యాంకర్ అడగగా.
శేఖర్ వెంటనే ఎన్టీఆర్ అని చెప్పాడు.ఎన్టీఆర్ రిహార్సల్స్ కు ఎప్పుడు రాలేదని.
డైరెక్ట్ గానే చేసేస్తారు.అంటూ తెలిపాడు.
దీంతో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని మరోసారి అర్ధం అయ్యింది.
పది నిమిషాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి!