రెండో సారి పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్..!!
TeluguStop.com
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు.పార్లమెంట్ లో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యుల మద్ధతు లభించింది.
అయితే గత కొంతకాలంగా పలు వివాదాలు నడుస్తుండగానే పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.
గత నెల 8న పాక్ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.పీఎంఎల్ ఎన్ ( పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాబ్), పీపీపీ కూటమి విజయం సాధించింది.
ఈ క్రమంలోనే ఇవాళ ప్రధానమంత్రి నియామకం కోసం పార్లమెంట్ లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 మంది సభ్యులున్నారు.ఇందులో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యులు మద్ధతు తెలపగా.
పీటీఐ పార్టీ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు 92 మంది సభ్యుల మద్ధతు లభించింది.
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!