వీడియో: రాజు గుర్రాన్ని ముట్టుకుంది.. నెక్స్ట్ ఏం జరిగిందో తెలిస్తే..

లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్, సెయింట్ జేమ్స్ ప్యాలెస్ వద్ద కింగ్స్ గార్డ్ కాపలా కాస్తున్నారనే సంగతి తెలిసిందే.

వీరు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తారు.ఈ గార్డ్‌లకు ఒక కఠినమైన ప్రోటోకాల్ ఉంటుంది.

పర్యాటకులు తరచుగా వారి దగ్గర నిలబడి ఫోటోలు తీయడానికి ఆసక్తి చూపుతారు.అయితే, వారిని తాకడానికి లేదా వారితో మాట్లాడటానికి ప్రయత్నించకూడదు.

కింగ్స్ గార్డ్(King’s Guard) స్థావరాల చుట్టూ ఉన్న అనేక రాతపూర్వక హెచ్చరికలు గౌరవప్రదమైన దూరాన్ని పాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతాయి.

ఈ హెచ్చరికలు ఉన్నప్పటికీ, చాలా మంది ఫోటోలకు పోజు ఇస్తూ గార్డ్‌లను లేదా వారి గుర్రాలను( Horse) తాకడానికి ట్రై చేస్తారు.

ఒక మహిళ కూడా ఇలా ప్రయత్నించగా ఆమెకు ఊహించని షాక్ తగిలింది దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆ వైరల్ అయిన ఒక వీడియోలో, ఒక మహిళ గుర్రంపై కూర్చున్న కింగ్స్ గార్డ్ వద్ద నిలబడి ఫొటోకు పోజు ఇస్తోంది.

ఆమె గుర్రంపై చేయి పెట్టగానే, గుర్రం వెంటనే ఆమె వైపు తిరిగి, కొరకడానికి ప్రయత్నించినట్లు కనిపించింది.

"""/" / అదృష్టవశాత్తు, మహిళ చివరి క్షణంలో గుర్రం కరవకుండా తప్పించుకుంది.ఆమె తనను తాను సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ వీడియో మే 21న పోస్ట్ చేయగా, ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా వ్యూస్ పొందింది.

పర్యాటకులు గుర్రాలను ఎందుకు తాకాలని లేదా రాజభవన సైనికులతో ఫోటోలు ఎందుకు దిగాలని కోరుకుంటున్నారో తమకు అర్థం కావడం లేదని కొందరు వీడియో చూసినవారు కామెంట్లు చేశారు.

దీన్ని ఒక దుకాణంలో క్యాషియర్‌తో ఫోటో తీసుకోవడం అంత పిచ్చి పని అన్నట్లు పోల్చారు.

సైనికులు తమ విధులను నిర్వహించడానికి వారిని ఒంటరిగా వదిలివేయాలని రిక్వెస్ట్ చేశారు.

నో ఫ్లై లిస్టులో పేరు, పైగా ఉగ్రవాది.. నిజ్జర్‌కు ఇంతటి గౌరవమా , మీడియా ప్రశ్నకు తడబడ్డ కెనడా ఉప ప్రధాని