వైసీపీలో నంబర్ టూ ఆమేనా?

వైసీపీలో కీలక నేత అంటే ఎవరికైనా జగన్ పేరు మాత్రమే గుర్తుకువస్తుంది.వైసీపీలో కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే.

అయితే వైసీపీలో నంబర్ టూ ఎవరు అనే అంశంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది కానీ క్లారిటీ మాత్రం రాదు.

జగన్ తరువాత ఎంతో మంది నాయకులు తమ పేర్లు జత కలిపి ముచ్చట పడుతున్నారు.

కానీ నంబర్ టూ ఎవరు అన్న ప్రశ్న దగ్గరే సమాధానం కూడా ఆగిపోతున్న పరిస్థితి నెలకొంది.

పార్టీ పెట్టిన మొదట్లో జగన్ తల్లి వైఎస్ విజయమ్మను నంబర్ టూ అని నేతలు భావించేవాళ్లు.

అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలతో వచ్చిన విభేదాల కారణంగా విజయమ్మ జగన్‌తో కాకుండా షర్మిలతోనే ఎక్కువ కనిపిస్తున్నారు.

ఆమె హైదరాబాద్‌కే పరిమితం కావడంతో వైసీపీలో విజయమ్మ నామస్మరణ తగ్గిపోతోంది.అయితే ఇటీవల విజయమ్మ స్థానాన్ని వైఎస్ భారతి ఆక్రమించినట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే విజయసాయిరెడ్డికి రెండోసారి రాజ్యసభకు అవకాశం కల్పించడంతో ఆయన జగన్‌తో పాటు వైఎస్ భారతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అంశమే ప్రస్తుతం వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.వైసీపీలో నంబర్ టూ వైఎస్ భారతి అని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.

"""/"/ వైఎస్ భారతి పేరును వైసీపీ నేతలు అఫీషియల్‌గా ఎప్పుడూ ప్రస్తావించలేదు.పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనేది కూడా తక్కువే.

జగన్‌తో వ్యక్తిగత కార్యక్రమాలు తప్ప ఆమె పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం అరుదు అనే చెప్పాలి.

కానీ విజయసాయిరెడ్డి వైఎస్ విజయమ్మ పేరును కాకుండా వైఎస్ భారతి పేరుని ప్రస్తావించి.

తనకు రాజ్యసభ సీటు రెన్యూవల్ చేయడం వెనుక జగన్‌తో పాటు ఆమె కూడా ఉన్నారని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీంతో వైసీపీలో వైఎస్ భారతి కీలక నేతగా ఉన్నారని విజయసాయిరెడ్డి సంకేతాలు పంపినట్లు పలువురు భావిస్తున్నారు.

 .

మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ తేదీ ఇదే.. ఆ తేదీకే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందా?