తను ఎప్పటికీ నా మొదటి పాపే.. వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

శౌర్యువ్ దర్శకత్వంలో మృణాల్‌ ఠాకూర్‌, నాని జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న( Hi Nanna ).

ఈ సినిమాలో బేబీ కియారా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇక ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు.

తల్లి పాత్రలో కూడా హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ చాలా అద్భుతంగా నటించిందని చెప్పాలి.

సినిమా కోసం నటించే ఆన్‌స్క్రీన్‌ సంబంధాలు కొన్ని సమయాల్లో ఆఫ్‌స్క్రీన్‌ లోనూ కొనసాగుతుంటాయి.

"""/" / హాయ్‌నాన్న నటించిన కియారాతో తనకు అలాంటి అనుబంధం ఏర్పడిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మృణాల్‌ ఠాకూర్.

ఈ మేరకు మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ.

తను నాకంటే చాలా చిన్నదే అయినా ఇప్పటికీ యష్నా ( Kiara Khanna )లేదా ఎం అనే పిలుస్తుంది.

తను ఎప్పటికీ నా మొదటి పాపే.భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టినా కూడా వారు నాకు రెండో సంతానమే అవుతారు.

ఎందుకంటే తనతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిది.తను కళ్లతోనే ఎన్నో విషయాలను మాట్లాడేస్తుంది.

"""/" / తననుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అంటూ ఆ సినిమా చిత్రీకరణ వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు మృణాల్‌ ఠాకూర్‌.

ఆ పోస్ట్ పై కియారా ఖన్నా స్పందిస్తూ.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

ఇప్పుడు అంతే మిస్‌ అవుతున్నాను.మిమ్మల్ని కలవడం నా అదృష్టం.

మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉండాలి.త్వరలోనే నన్ను కలవండి అంటూ రిప్లై ఇచ్చింది.

దానికి మృణాల్‌ స్పందిస్తూ.రెండు హార్ట్‌ సింబల్స్‌ ని జోడించింది.

కాగా ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కూడా రక రకాలుగా స్పందిస్తున్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు