ఆమెకి కళ్లులేవు.. కానీ వంట అద్భుతంగా చేస్తుంది!

ఇక్కడ అన్నీ అవయవాలు సరిగ్గా వుండి కూడా ఎంతోమంది కుంటివాళ్లుగా బతుకుతూ వుంటారు.

అదేనండీ.మావల్లకాదని, అవకాశాలు రావడం లేదని, లక్ లేదని.

ఇలా రకరకాల షాకులు చెబుతూ ఎవరో ఒకరిమీద ఆధారపడి పరాన్నజీవనం గడుపుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ వుంటారు.

అయితే కొందరుంటారు, వారు నిజంగానే పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారు.అలాగని వారు తమ అంగవైకల్యాన్ని చూస్తూ దేవున్నో, లేదంటే మరెవరినో నిందిస్తూ కూర్చోరు.

అవయవాలు లోపం వున్నప్పటికీ అన్ని అవయవాలు వున్నవారి కంటే కూడా ఎంతో ఎక్కువ ఆత్మస్థైర్యాన్ని కలిగి వుంటారు.

"""/" / అవును, అలాంటివారి కధలను విన్నపుడు చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది.ఇపుడు అలాంటి ఒక మహిళ గురించి ఇక్కడ చెప్పుకోబోతున్నాం.

అవును, కేరళ( Kerala )లోని కాసర్‌గోడ్‌ జిల్లాలో రావణేశ్వరంలో నివసించే ఆశాలతను చూసి మనం నేర్చుకోవలసినది ఎంతో వుంది.

49 ఏళ్ల ఆశాలత( Ashalata ) పుట్టికతోనే అంధురాలు.అయితే ఆమె వంట చేసే పద్ధతి చూస్తే ఆమె మునివేళ్ళకు కాళ్లున్నాయోమో అని భ్రమ కలుగుతుంది.

కత్తిపీటతో కూరలు తరగడం, మిక్సీలో మసాలాలు వేసుకోవడం, స్టౌ ఆన్‌ చేసి మూకుళ్లు పెట్టడం, వండటం ఇలా ఒక్కటేమిటి అన్నీ పనులు ఆమె సమర్ధవంతంగా చేసుకుంటుంది.

"""/" / ఈ విషయమై ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.“పుట్టుకతోనే నాకు దృష్టి లేదు.

టీనేజ్‌ వరకూ వెలుతురు, చీకటి కాస్తంత అర్థమయ్యేవి.టీనేజ్‌ దాటాక పూర్తిగా చీకటి కమ్ముకుంది.

అయినప్పటికీ మా అమ్మా నాన్నలు నన్ను అంధురాలిగా పెంచలేదు.మా నాన్న టి.

సి.దామోదర్‌ నన్ను చదువుకోమని బాగా ప్రోత్సహించాడు.

ఈ క్రమంలోనే బ్రెయిలీ( Braille )లోనే చదువు కొనసాగించి బి.ఇడి చేశాను.

ఆ తర్వాత టీచర్‌ ఉద్యోగం పొందాను.ఇపుడు మా ఊరి గవర్నమెంట్‌ స్కూల్‌లోనే సోషల్‌ టీచర్‌గా పని చేస్తున్నాను!” అని చెప్పింది ఆశాలత.

కాగ్ ఆమెకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.వారి బాగోగులు కూడా ఆమెనే చూసుంతోంది.

ఫ్యామిలీతో దేవర షూటింగ్ కి పయనమైన తారక్.. వైరల్ అవుతున్న ఫోటోలు!