'ఎక్సప్రెస్ రాజా' కాంబోలో మరొక సినిమా ?
TeluguStop.com
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు ఆకట్టుకునే అందం కూడా ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.
ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.ఈయన కెరీర్ మొదటి నుండి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే కొద్దీ రోజులుగా ఈయన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.ఆయన నటించిన శతమానం భవతి, మహానుభావుడు సినిమా హిట్స్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం అందుకోలేక పోయాడు.
ఈ మధ్యనే శర్వానంద్ చేసిన శ్రీకారం సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది కానీ కమర్షియల్ హిట్ సాధించలేకపోయింది.
ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా మహాసముద్రంసినిమా లో నటిస్తున్నాడు.
"""/"/
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.మహా సముద్రం సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.
అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో పాటు శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవార్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. """/"/
ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే శర్వానంద్ మరొక సినిమాను కూడా లైన్లో పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.
శర్వానంద్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్టు టాక్.ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో ఎక్సప్రెస్ రాజా సినిమా వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరి చూడాలి ఈ వార్తలో నిజమెంతో.