శ్రీకారం టీజర్ టాక్: జుట్టు, మీసం అంటూ రైతు ప్రాముఖ్యతను వివరించిన శర్వా!

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

గతేడాది జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా, ఆ సినిమా ఫ్లాప్‌గా నిలవడంతో, ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

ఇక పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల మందుకు వస్తున్న శర్వా, శ్రీకారం చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమాను కొత్త దర్శకుడు బి.కిషోర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా కథ పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిందని చెప్పేయొచ్చు.

ఇక ఈ టీజర్‌లో శర్వానంద్ పక్కా పల్లెటూరి అబ్బాయిగా మనకు కనిపిస్తున్నాడు.అంతేగాక రైతు-వ్యవసాయం గురించి ప్రేక్షకులను ఆలోచింపజేసే డైలాగుతో టీజర్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ తనదైన అందాల ఆరబోతతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

కాగా ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని, ఇప్పటికే రిలీజ్ అయిన ‘భలేగుంది బాల’ పాట నిరూపించింది.

14 రీల్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన శ్రీకారం చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

ఇక ఈ సినిమాను మార్చి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ చిత్ర టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?