పొలం పనులకు శ్రీకారం చుట్టిన శర్వా

పొలం పనులకు శ్రీకారం చుట్టిన శర్వా

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

పొలం పనులకు శ్రీకారం చుట్టిన శర్వా

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్, అన్నట్లుగానే కొన్ని నిమిషాల ముందు ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పొలం పనులకు శ్రీకారం చుట్టిన శర్వా

ఈ చిత్రం పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందనే విషయం మనకు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

‘ఇతను మన కేశవుల కొడుకు.పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడిండి’ అంటూ యూనిట్ శర్వా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

ఈ సినిమాతో మరోసారి శర్వానంద్ తనదైన మార్క్ వదులుతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో శర్వా సరసన ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ అమ్మడు గతంలో నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించింది.

""img "aligncenter" Src="" / వీరిద్దరి మధ్య నడిచే అందమైన లవ్ ట్రాక్ అందరి మనసుల్ని దోచుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాను కిషోర్.బి డైరెక్ట్ చేస్తుండగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

దుబాయ్ హోటల్‌లో ఇండియన్ కోటీశ్వరుడి వింత చేష్ట.. సిగ్గులేదా అంటూ నెటిజన్లు ఫైర్!

దుబాయ్ హోటల్‌లో ఇండియన్ కోటీశ్వరుడి వింత చేష్ట.. సిగ్గులేదా అంటూ నెటిజన్లు ఫైర్!