శ్రియ అందంపై శర్వానంద్ కామెంట్స్.. ఇప్పటికి అలానే ఉందంటూ?

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరన్ తాజాగా నటించిన చిత్రం గమనం.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ తెలుగు హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే శ్రీయ గురించి, ఆమె అందం గురించి పలు వ్యాఖ్యలు చేశారు శర్వానంద్.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.జ్ఞాన శేఖర్ ఒక సినిమాను నిర్మిస్తున్నానని చెప్పినప్పుడు వద్దు అని సలహా ఇచ్చా.

కథ పై ఉన్న నమ్మకంతో తను ముందుకు వెళ్ళాడు.ఒకసారి ఆ కథని నాకు వినిపించాడు.

వినగానే చాలా బాగా నచ్చేసింది.అదే ఈ గమనం సినిమా.

ఇకపోతే శ్రీయ నేను మంచి స్నేహితులం.మేము  ఇద్దరం కలిసి నువ్వా నేనా అనే సినిమాలో నటించాం .

నాకు శ్రీయా లో  ఎటువంటి మార్పు కనిపించలేదు.సంతోషం సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉంది.

నేను ఆమె అభిమానిని శర్వానంద్ తెలిపారు.అలాగే గమనం సినిమా దర్శకురాలు సృజన రావు ప్రతిభ ఏంటో నాకు బాగా తెలుసు.

సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపారు.ఈ సినిమాతో సృజనా రావు దర్శకురాలిగా పరిచయం కానుంది.

"""/" / ఈ సినిమాలో శ్రియ శరన్ తో పాటు, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

మేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞాన శేఖర్ విఎస్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు దేవా కట్టా, ఎస్ వి కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.

ఇదేందయ్యా ఇది.. ఎప్పుడు చూడలే.. మన సాంప్రదాయాలు ట్రెండీగా మారిపోయాయో..