మహేష్ తో పోటికి వచ్చి చేతులు కాల్చుకున్నారు
TeluguStop.com
తెలుగు రాష్ట్రాల వరకు ఏ ఏరియా ఎవరికీ సొంతం కాదు.నైజాంలో మహేష్ - పవన్ .
ఇద్దరు భీకరంగా కలెక్షన్లు రాబడతారు.సీడెడ్ ఎన్టీఆర్ దే అయినా, రామ్ చరణ్, కొత్తగా పవన్ కళ్యాణ్ ఏమి తక్కువ కాదు.
గోదావారి జిల్లాలు మహేష్ కి మాత్రమే నీరాజనాలు పలకవు.ఉత్తరాంధ్రలో మెగా హీరోలకి మెగా హీరోలే పోటిగా ఉంటారు.
ఇలా చెప్పుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మన హీరోలకి బలమైన ఏరియాలు ఉన్నాయి, బలహీనమైన ఏరియాలు ఉన్నాయి.
కాని ఒక హీరో ఒక ఏరియా పూర్తిగా డామినేట్ చేస్తున్న పరిస్థితి అయితే లేదు.
కాని ఓవర్సీస్ లో మాత్రం లెక్క వేరుగా ఉంది.దశాబ్దకాలంగా మహేష్ కి మహేష్ పోటిగా ఉంటూ వస్తున్నాడు.
అతడు నుంచి బ్రహ్మోత్సవం వరకు, మహేష్ నటించిన చిత్రాల్లో ఓవర్సీస్ బయ్యర్లకి నష్టాలు తెచ్చిన ఒకే ఒక్క చిత్రం బ్రహ్మోత్సవం.
ఇక మీరే ఊహించుకోండి, మధ్యలో వచ్చిన ఫ్లాప్, డిజాస్టర్ సినిమాలకి కూడా అమెరికాలో లాభాలు వచ్చాయి అంటే అక్కడ సూపర్ స్టార్ హవా ఎలాంటిదో.
స్పైడర్ కేవలం నార్త్ అమెరికా హక్కులు 15.50 కోట్లకు వెళ్ళాయి.
బ్రహ్మోత్సవంతో తానూ క్రియేట్ చేసుకున్న నాన్ బాహుబలి రికార్డుని మళ్ళీ తానే బద్దలు కొట్టాడు ప్రిన్స్.
ఇక మొత్తం ఓవర్సీస్ హక్కులు కలిపితే ఆ లెక్క 23.50 కోట్లు.
మిగితా స్టార్ హీరోల రెండు సినిమాల హక్కులు కలిపినా ఇంత మొత్తం రాదు.
అలాంటి మహేష్ తో ఓవర్సీస్ లో పోటిపడాలని ఎవరికీ ఉంటుంది? చిత్రంగా ఆ సాహసం చేసారు హీరో శర్వానంద్ - దర్శకుడు మారుతి.
వీరి కాంబినేషన్లో వస్తున్న మహానుభావుడుని సెప్టెంబర్ 29న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
అంటే స్పైడర్ విడుదల అయిన రెండు రోజులకి.మొదట మారుతి - శర్వానంద్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు మూడు కోట్లకు అమ్ముడుపోయేలా చర్చలు జరిగాయి.
మూడు కోట్లు ఇచ్చేందుకు పంపిణిదారులు ఒప్పుకున్నారు కూడా.కాని ఇప్పుడు అందులో సగం మాత్రమే ఇస్తాము అని అంటున్నారట.
అలా మాట మార్చడానికి కారణం, మహానుభావుడు స్పైడర్ తో పోటిలో దిగడమే.స్పైడర్ తో పాటు దిగితే ఓవర్సీస్ లో థియేటర్లు కూడా దొరకడం కష్టం, ఆ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ రికార్డు కలెక్షన్స్ వస్తాయి, అలాంటి డామినేషన్ లో మూడు కోట్ల ఎలా ఇస్తాం, డీల్ క్యాన్సల్ అనేసారట పంపిణిదారులు.
స్పైడర్ వలన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా నష్టం ఉండదు.
శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా, శతమమానంభవతి రెండూ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాల మధ్య వచ్చి సక్సెస్ ని రుచి చూసాయి.
అప్పుడు ఓవర్సీస్ లో కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు.కాని ఓవర్సీస్ లో మహేష్ రేంజ్ వేరు కదా, అందుకే ఈ ఇబ్బందులు.
గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?