వరుస ప్లాప్స్.. అయినా రెండు కోట్లు పెంచేసిన టాలెంటెడ్ హీరో!

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్.ఈయన కెరీర్ మొదటి నుండి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే కొద్దీ రోజులుగా ఈయన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.బాక్సాఫీస్ వద్ద సరైన ప్రభావం చూపలేక చతికల పడిపోతున్నాయి.

శర్వా లాస్ట్ హిట్ సినిమా మహానుభావుడు.ఈ సినిమాతో నాలుగేళ్ళ క్రితం హిట్ అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత శర్వానంద్ ను హిట్ పలకరించడమే లేదు.ఆయన చేసిన శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు విడుదలకు ముందు భారీ హైప్ వచ్చిన ఆ తర్వాత అంత హిట్ అవ్వలేక పోయాయి.

మంచి హిట్స్ తో సాఫీగా సాగిపోతున్న ఆయన కెరీర్ లో వరుసగా 5 ప్లాప్స్ పలకరించడంతో రేసులో వెనుక పడ్డాడు.

అయినా కూడా ఈయన సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా అవుతుండడం విశేషం.

అందుకే ఈయనకు ప్లాప్స్ వస్తున్నా కూడా వరుస సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు.

"""/" / ఈ నేపథ్యంలోనే ఈయన వరుస ప్లాప్స్ వస్తున్నా రెండు కోట్ల రెమ్యునరేషన్ పెంచేసాడని అంటున్నారు.

ఇంతకు ముందు వరకు శర్వా సినిమాకు రూ 8 కోట్లు తీసుకునే వారు.

కానీ ఇప్పుడు శర్వా నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు రూ.10 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా ఈ నెల సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఈ యంగ్ హీరో ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.