జాను ఎఫెక్ట్... కొద్ది రోజులు కొత్త దర్శకులకి శర్వా దూరం

టాలీవుడ్ లో క్రేజీ హీరోగా టాలెంటెడ్ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని శర్వానంద్ సొంతం చేసుకున్నాడు.

హీరో ఫ్రెండ్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తరువాత సైడ్ హీరోగా మారి ప్రస్థానం సినిమాతో సత్తా చాటి సోలో హీరోగా ఎగిగిన నటుడు శర్వానంద్ అని చెప్పాలి.

ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న కూడా తన సొంత ప్రయత్నాలతోనే పైకి ఎదుగుతూ వచ్చాడు.

రన్ రాజా రన్ సినిమాతో శర్వానంద్ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది.ప్రస్తుతం తెలుగులో ఉన్న కుర్ర హీరోలలో తనకంటూ క్రేజ్ ని శర్వానంద్ సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో శర్వానంద్ కి వరుసగా ఫ్లాప్ లు పడుతున్నాయి.

మంచి బ్యానర్ వేల్యూతో సినిమాలు చేస్తున్న కంటెంట్ కొత్తగా ఉన్న ఆడియన్స్ కి కనెక్ట్ కావడంలో అతని సినిమాలు ఎక్కడో మిస్ అవుతున్నాయి.

పడిపడి లేచే మనసు, రాదా, రణరంగం, తాజాగా జానుతో వరుసగా నాలుగు డిజాస్టర్ లు శర్వాకి వచ్చాయి.

ఈ సినిమాల కంటెంట్ బాగున్న ఎమోషనల్ గా ఆడియన్స్ కి సింక్ అవలేదు.

ఇలా వరుస ఫ్లాప్ లతో కాస్తా డిస్టర్బ్ అయిన శర్వానంద్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడానికి శ్రీకారం షూటింగ్ వాయిదా వేసుకొని విదేశాలకి చెక్కేసాడు.

అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరల ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

అయితే సాలిడ్ హిట్ పడే వరకు కొత్త దర్శకుల కథలకి దూరంగా ఉండాలని జాను ఫ్లాప్ తో శర్వానంద్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

శ్రీకారం హిట్ కొట్టి తరువాత రన్ రాజా రన్ లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ రావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మానసిక స్థిమితం లేని కోమటిరెడ్డి మాటలు నమ్మను..: కౌశిక్ రెడ్డి