ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో అలా చేయకు..షారుఖ్ భార్య కూతురుకిచ్చిన చెత్త సలహా ఇదే!

బాలీవుడ్ బాద్ షాగా పేరును సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు.

షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురించి కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు.కాఫీ విత్ కరణ్ షో అంటే కరణ్ జోహార్ ఆ షోలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ కు పార్టీలు అంటే ఇష్టమని అయితే షారుఖ్ తో పార్టీ అంటే మాత్రం తాను ఇబ్బంది పడతానని అన్నారు.

షారుఖ్ ఇంట్లో పార్టీ చేస్తే అతిథులను ఇంటి దగ్గర దింపేవరకు వెళతాడని ఇంట్లో ఎక్కడా కనిపించడని అందువల్ల కొన్నిసార్లు నాకు రోడ్డుమీద పార్టీ చేసుకున్నామా అని అనిపిస్తుందని గౌరీ ఖాన్ కామెంట్లు చేశారు.

షారుఖ్ అతిథులను దింపడానికి వెళ్తాడు కాబట్టి మిగతా వాళ్లు షారుఖ్ ఎక్కడ అని అడిగితే ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉండదని గౌరీ ఖాన్ పేర్కొన్నారు.

షారుఖ్ ఖాన్ తన మధ్య జరిగిన పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని గౌరీ ఖాన్ వెల్లడించారు.

పెళ్లి గురించి ఎప్పుడైనా గుర్తుకొస్తే నాకు దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా గుర్తుకు వస్తుందని గౌరీ ఖాన్ కామెంట్లు చేశారు.

"""/"/ కరణ్ జోహార్ గౌరీ ఖాన్ ను కూతురు సుహానా ఖాన్ కు రిలేషన్ గురించి సలహా ఇవ్వాల్సి వస్తే ఎలాంటి సలహా ఇస్తావని అడిగారు.

ఒకే సమయంలో ఇద్దరితో డేటింగ్ చేయొద్దని కూతురుకు నేను సలహా ఇస్తానని గౌరీ ఖాన్ కామెంట్లు చేయడం గమనార్హం.

గౌరీ ఖాన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ గురించి దారుణమైన విషప్రచారం.. ఖండించకపోతే ఇబ్బందేనా?