షర్మిల ట్వీట్.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ..!

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

రాహుల్ గాంధీ పట్టుదలతో ప్రజలకు స్ఫూర్తిని ఇవ్వాలని షర్మిల ట్వీట్ చేశారు.అంతేకాకుండా ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను షర్మిల కలిసిన సంగతి తెలిసిందే.

అయితే షర్మిల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనున్నారా అనే వార్తలు జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీకి చేసిన ట్వీట్ తో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

కెనడియన్ భార్యతో భారతదేశానికి షిఫ్ట్ అయిన యూఎస్ వ్యక్తి.. చివరికి..?