హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న షర్మిల కొడుకు డైరెక్టర్ ఎవరంటే..?
TeluguStop.com
పొలిటీషియన్స్ కొడుకులు సినిమాల్లో కి రావడం ఈ మధ్య మనం చాలా వరకు గమనిస్తూనే ఉన్నాం అలాంటి వాళ్లలో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలిగా, వైఎస్సార్ టిపి అధినేత్రిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల( YS Sharmila ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రజల్లో తిరుగుతూ పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా వైఎస్ షర్మిల తన కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఉన్నట్టుండి ఇలా ఈ వార్తలు ఒక్కసారిగా బయటకు రావడానికి కారణం కూడా లేకపోలేదు.
నిన్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా షర్మిల తన కొడుకు వైయస్ రాజారెడ్డి( Y.
S.Raja Reddy ) తో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
ఇక వైయస్ రాజారెడ్డి చూడడానికి అచ్చం హీరో కట్ అవుట్ తో చాలా పర్ఫెక్ట్ గా హీరో అనిపించుకునేలా కనిపించేసరికి ప్రతి ఒక్కరు కూడా ఇక హీరోగా ఈయన ఇండస్ట్రీలోకి వస్తే బాగుండు అని కామెంట్లు చేశారు.
అయితే అందుకు తగ్గట్టుగానే వైఎస్ కుటుంబంలో రాజారెడ్డిని హీరోగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్న( Puri Jagannadh )థ్ కథను వినిపించారట.
యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ఒక కథను సిద్ధం చేశారట.ఈ కథ కూడా వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులకు బాగా నచ్చడంతో త్వరలోనే రాజారెడ్డి ఎంట్రీకి సర్వం సిద్ధం చేస్తున్నారు.
మరొకవైపు చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ను ఏ విధంగా అయితే చాలా గ్రాండ్ గా ఇండస్ట్రీకి లాంచ్ చేశారో అదే విధంగా షర్మిల కూడా తన కొడుకును అదే రేంజిలో ఇండస్ట్రీకి లాంఛ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి అయితే భారీ బడ్జెట్లోనే తన కొడుకును చాలా గ్రాండ్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుందట షర్మిల.
తమ ఫ్యామిలీ నుంచి కూడా ఒక స్టార్ హీరో ఉండాలని షర్మిల భావిస్తున్నట్టు గా తెలుస్తుంది.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!