షర్మిల వ్యక్తిగత విమర్శలు సరికాదు..: సజ్జల
TeluguStop.com
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహారిస్తున్నాయని మండిపడ్డారు.ఈసీపై ఒత్తిడి తేవడంతోనే అధికారుల బదిలీ జరుగుతోందని తెలిపారు.
చంద్రబాబు,( Chandrababu ) పురందేశ్వరి( Purandeshwari ) ఫెయిల్యూర్ నేతలన్న సజ్జల చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.
షర్మిల( Sharmila ) తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో తెలియదన్నారు.అదేవిధంగా మళ్లీ ఏపీకి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారో తెలియదని చెప్పారు.
షర్మిల వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్న సజ్జల జగన్ పై తప్పుడు ఆరోపణలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
చంద్రబాబు సపోర్టుతో షర్మిల ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు.