షర్మిల పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదా ?
TeluguStop.com
వైయస్సార్ తెలంగాణ పార్( YSR Telangana Party )టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కు వరుస కష్టాలు ఎదురవుతూ వస్తున్నాయి.
పార్టీ స్థాపించిన తర్వాత భారీగా చేరికలు ఉంటాయని, తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగవచ్చని అంచనా తో షర్మిల ఉండగా, పార్టీలో ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడం, మొదట్లో చేరిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడం , ఒంటరిగా పార్టీని ఎన్నికలకు తీసుకువెళ్తే దారుణమైన ఫలితాలు వస్తాయనే ఆలోచనతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు షర్మిల ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.
దీంతో చివరికి ఒంటరిగానే అన్ని నియోజకవర్గంలోనూ పోటీ చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించారు .
"""/" /
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీకి దిగుతారని షర్మిల( YS Sharmila ) ప్రకటించారు.
కాకపోతే ఆమె పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 62 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
దీంట్లో కూడా షర్మిల పోటీ చేసే ఆలోచనలో ఉన్న పాలేరు నియోజకవర్గం నుంచి ఎనిమిది దరఖాస్తులు అందగా, షర్మిల తల్లి విజయమ్మ భర్త బ్రదర్ అనిల్ కుమార్( Bro Anil Kumar ) పోటీ చేస్తారనుకుంటున్న సికింద్రాబాద్ నుంచి మరో 12 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది .
ఈ రెండు చోట్ల మినహాయిస్తే మొత్తం 40 మాత్రమే దరఖాస్తులు అందాయి. """/" /
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా , సగం స్థానాలకు కూడా దరఖాస్తులు అందకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన మొదట్లోనే పార్టీ నిర్మాణంపై షర్మిల దృష్టి పెట్టకుండా, హడావిడిగా పాదయాత్రలు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తదితర కారణాలతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాలేకపోయింది.
కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించినా, అది కూడా విఫలం కావడంతో 119 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు .
కానీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవడంతో షర్మిల పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది.
మందులతో పని లేకుండా రక్తహీనత దూరం కావాలంటే ఇలా చేయండి!!