షర్మిల తలనొప్పీ టీఆర్ఎస్ కు మొదలయిందిగా  ?

తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు.

అనేక ప్రజా ఉద్యమాలు,  ఆందోళనలు నిర్వహిస్తునే తెలంగాణ అంతట పాదయాత్ర నిర్వహిస్తున్నారు.వివిధ సమస్యల పై నిత్యం దొరా అంటూ కెసిఆర్ ను విమర్శిస్తూ, సెటైర్స్ వేస్తున్నారు.

అయితే షర్మిల పార్టీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం , పార్టీలో చేరికలు లేకపోవడం వంటి కారణాలతో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోనట్టుగానే కెసిఆర్ టిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే వైస్ షర్మిల ఇప్పుడు స్పీడ్ పెంచారు.టిఆర్ఎస్ ను మరింత కట్టడి చేసే విధంగా వ్యవహారాలు చేసి తెలంగాణలో పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు.

ఈ పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.  తాజాగా హుజూర్ నగర్ మండలం లక్కవరం లో షర్మిల పాదయాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా లక్కవరంలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులకు వ్యతిరేకంగా హడావుడి చేశారు.

దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.అంతేకాదు చిన్నపాటి ఘర్షణ కూడా జరగడంతో షర్మిల పార్టీకి చెందిన కీలక నాయకుడు ఏపూరి సోమన్న పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లుగా షర్మిల టీం ఆరోపిస్తోంది.

అంతేకాదు ఏపూరి సోమన్న పై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల దీక్షకు దిగారు.

వైఎస్సార్  విగ్రహం వద్ద జోరు వానలోనే ఆమె నిరసన దీక్ష చేపట్టారు.  """/"/  దీక్ష విరమించాల్సిందిగా పోలీసులు ఆమెకు ఎంత నచ్చజెప్పినా , అక్కడి నుంచి వెళ్లేందుకు షర్మిల ఇష్టపడలేదు.

ఏపూరి సోమన్న పై దాడికి దిగింది మఠంపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడని,  అతనిని వెంటనే అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నేతలు కావడంతోనే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారని షర్మిల విమర్శలు చేస్తున్నారు.

అయితే రాజకీయంగా లబ్ధి పొందినందుకు షర్మిల ఇంత హంగామా సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

బిజెపి కాంగ్రెస్ నేతల దూకుడుతో టిఆర్ఎస్ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ఇప్పుడు షర్మిల కూడా గతం తో పోలిస్తే టీఆర్ఎస్ పై మరింత దూకుడు పెంచడం తో  టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

   .

మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ సవాల్..!!