వైసీపీని తిడితేనే షర్మిల గ్రాఫ్ పెరిగేది ? మొదలెట్టారుగా ? 

వైసిపి ఏపీ అధికార పార్టీగా ఉంది.తెలంగాణ రాజకీయాలతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది.

భవిష్యత్తులోనూ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదు.అందుకే అక్కడ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తో ఎన్నికలకు ముందు నుంచి వైసిపి సఖ్యతగా మెలుగుతోంది.

ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సన్నిహితంగా మెలుగుతున్నారు.ఏపీ తెలంగాణ విభజన సమస్యల గురించి వీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుని తెగతెంపులు చేసుకున్నారు.

చాలా విషయాల్లో ఏకాభిప్రాయం వచ్చింది.అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో  టిఆర్ఎస్,  వైసిపి నాయకులు మధ్య విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగుతున్నా,  కెసిఆర్ - జగన్ మాత్రం నేరుగా విమర్శలు చేసుకోవడం లేదు.

  తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఏపీ తెలంగాణ విభజనను వైసిపి వ్యతిరేకిస్తోందని,  ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లను మళ్లీ కలపాలనే ఆలోచనను వైఎస్సార్సీపీ ఎప్పుడూ స్వాగతిస్తుందని , అవసరమైతే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాడుతామంటూ సజ్జల సంచలన ప్రకటన చేశారు.

ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ కంటే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలను షర్మిల తప్పు పట్టారు.

ఏపీ తెలంగాణను కలపడం అనే ప్రతిపాదన అశాస్త్రియం అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.తెలంగాణ ఇప్పుడు వాస్తవం .

ఎంతో మంది ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ.చరిత్రలో మరవలేని అధ్యాయం " అంటూ షర్మిల సజ్జలకు కౌంటర్ ఇచ్చారు.

విభజించిన రెండు రాష్ట్రాలను తిరిగి కలపడం గురించి సజ్జల ఎలా ఆలోచించగలరు ?  మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి తప్ప , రెండు రాష్ట్రాలను తిరిగి కలపడంపై కాదు,  మీ హక్కుల కోసం పోరాడండి .

మీ రాష్ట్రానికి న్యాయం చేయండి కానీ,  తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరచవద్దు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

  """/"/ గతంలోనూ ఓ సందర్భంగా ఏపీ వ్యవహారంపై స్పందించిన షర్మిల జగన్ రెడ్డిని అడగండి అంటూ మాట్లాడారు.

ఇప్పటికే జగన్ కేసీఆర్ కు మధ్య సానిహిత్యం కొనసాగుతున్న నేపథ్యంలో,  షర్మిలను జగన్ కేసీఆర్ లే తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసి ఆమె ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలి అని చూస్తున్నారని వస్తున్న విమర్శలు నేపథ్యంలో ,  షర్మిల వైసీపీని టార్గెట్  చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

దీని ద్వారా వైసిపి కి తమకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ఆమె హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 .

నేటితో ముగియనున్న సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!